తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడి ఢిల్లీ పర్యటన!
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడు జి. రాజేశం గౌడ్ మరియు సభ్యులు ఎం. చెన్నయ్య కేంద్ర ఆర్థిక సంఘ అధ్యక్షులు ఎన్ కె సింగ్, సెక్రటరీ అరవింద్ మెహతా తో వారి కార్యాలయం జవహర్ వ్యాపార భవనం ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ర్టఆర్థిక సంఘం సూచనలతో ఒక లేఖ అందజేసి జిల్లా మరియు మండల స్థాయి పంచాయితీ రాజ్ సంస్థలకు కేంద్ర నిధుల విడుదల యొక్క ఆవశ్యకతను వివరించనైనది. ఈ సందర్బంగా జరిగిన చర్చలతో రాష్ట్ర ఆర్థిక సంఘాల సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించవలసిన అవసరం గురించి మరియు రాష్ట్ర ఆర్థిక సంఘాల బలోపేతమునకు అవసరమగు సూచనలు ప్రస్తావనకు వచ్చినాయి.
రాబోవు 15వ ఆర్థిక సంఘ సిఫారసులో అన్ని స్థాయి సంస్థలకు అవసరమైన నిధుల విడుదలకు తగు సూచనలు ఉండగలవని తెలిపినారు. స్థానిక సంస్థల బలోపేతమునకు అవసరమైన నిధులు మరియు అధికారాల బదలాయింపునకు రాష్ట్రాల ఆర్థిక సంఘాల సూచనలు చాలా ముఖ్యమైనవి. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పతాక స్థాయి కార్యక్రమాలు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకములను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అతిధి మర్యాదలకు సంతోషం వ్యక్త పరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించాలని కేంద్ర ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎన్ కె సింగ్ ను కోరడమైనది.