రాంకిరెడ్డి సాత్విక్ సైరాజ్‌ కు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అభినందనలు!

Related image

థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ పురుషుల డబుల్ టోర్నమెంట్ ఫైనల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాంకిరెడ్డి సాత్విక్ సైరాజ్‌ తన కెరీర్‌లో అతిపెద్ద టైటిల్‌ను కైవసం చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అభినందించారు. మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టితో కలిసి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యుఎఫ్) పర్యటనలో వీరు ఈ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా, టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారత జట్టుగా చరిత్రలో తమ పేర్లను పొందుపరిచారు. ఈ నేపధ్యంలో ఇరువురు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ వారు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ టైటిల్స్ గెలవాలని ఆకాంక్షించారు.

Andhra Pradesh
Thailand
Badminton
Men’s Double
BishwaBhushan

More Press Releases