రేపు మంత్రి కేటీఆర్ వ‌రంగ‌ల్ పర్యటన.. వివరాలు!

Related image

  • వ‌ర‌ద మంపు ప్రాంతాల ప‌ర్య‌ట‌న‌, ప‌రిశీల‌న‌
  • అనంత‌రం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర‌ద‌ న‌ష్టాల‌పై స‌మీక్ష‌
వ‌రంగ‌ల్, ఆగ‌స్టు 17ః వ‌రంగ‌ల్ న‌గ‌రంలో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌చ్చిన వ‌ర‌ద‌లు-మిగిల్చిన న‌ష్టాల‌ను ప‌రిశీలించి, వ‌ర‌ద బాధితు‌ల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి క‌ల్వ‌కుంట్ల రామారావు మంగ‌ళ‌వారం వ‌రంగ‌ల్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉదయం 9.30 గంటలకు హెలీ క్యాప్ట‌ర్ లో వ‌రంగ‌ల్ కి వెళ్తారు. ఏరియ‌ల్ వ్యూ అనంత‌రం దిగుతారు. ఆ త‌ర్వాత‌ వ‌రంగ‌ల్ న‌గ‌రంలో రోడ్డుగుండా వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌ను, పున‌రావాస కేంద్రాల‌ను సంద‌ర్శిస్తారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తారు. అనంత‌రం వ‌ర‌ద ప‌రిస్థితుల మీద‌ మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్, ఎర్ర‌బెల్లి ద‌యాకర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య భాస్క‌ర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయ‌ర్, కుడా చైర్మ‌న్, కార్పొరేట‌ర్లు,ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో స‌మీక్షిస్తారు. కాగా, కేటీఆర్ వెంట మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వెళ్తారు.

KTR

More Press Releases