అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ గోల్ఫ్ కోర్టు అభివృద్ధి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ గోల్ఫ్ కోర్టును రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, తెలంగాణ టూరిజం ప్రభుత్వ కార్యదర్శి కేఎస్. శ్రీనివాసరాజు, టూరిజం, రాష్ట్ర, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు మరియు గోల్ఫ్  అసోసియేషన్ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.

హైదరాబాద్ గోల్ఫ్ కోర్టును అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరం బ్రాండ్ కు అనుగుణంగా అభివృద్ధి చేయటానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మంత్రి మీడియా తో మాట్లాడారు.

తెలంగాణ పర్యాటకాబివృద్ధి సంస్థకు చెందిన సుమారు 213 ఎకరాల స్థలాన్ని హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కు లీజుకు తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో గోల్ఫ్ కోర్టును అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో పని చేస్తుందన్నారు. జాతీయ మరియు అంతర్జాతీయ కార్యక్రమాలలో తెలంగాణ పేరును కీర్తింపజేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు, గోల్ఫ్ అసోసియేషన్ సభ్యులను ఆదేశించారు.

హైదరాబాద్ గోల్ఫ్ కోర్సు (HGA) ఒక చారిత్రాత్మకమైన గోల్ఫ్ కోర్సుగా అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరం బ్రాండ్ విస్తరణకు ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. హైదరాబాద్ యొక్క బ్రాండ్ కు తగిన విధంగా గోల్ఫ్ కోర్టును సిద్ధం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్సు ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, తద్వారా గోల్ఫ్ క్రీడాకారులు / టూరిస్ట్ లకు వీక్షించడానికి అనుగుణంగా వుండేలా గోల్ఫ్ కోర్సు ను తీర్చితీద్దాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

ఈ గోల్ఫ్ కోర్సు హైదరాబాద్ అర్బన్ ప్రాంతంలో వుంది కాబట్టి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ తో కూడా చర్చించి గోల్ఫ్ కోర్సును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయుటకు విజ్ఞప్తి చేసి, అంతర్జాతీయ స్థాయి టౌర్నమెంట్ లు నిర్వహించటానికి ప్రముఖ పారిశ్రామిక వేత్తల సహకారం తీసుకుంటామన్నారు.

హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఇప్పటికే “Best Heritage Golf EXPO-2016” అవార్డును సొంతం చేసుకుందన్నారు. వీటితో పాటు హైదరాబాద్ గోల్ఫ్ కోర్సు అంతర్జాతీయ గోల్ఫ్ క్రీడలకు వేదికగా గుర్తింపపడిందన్నారు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్సును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతర్జాతీయ క్రీడాకారులకు మరియు టూరిస్టులకు వేదికగా నిలవనుందన్నారు. తద్వారా హైదరాబాద్ యొక్క బ్రాండ్ ను అంతర్జాతీయ స్థాయిలో నిలపవచ్చు అని వెల్లడించారు.

ఇకమీదట జరిగే ప్రతి యొక్క గోల్ఫ్ ఈవెంట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లోగో (Emblem) తో తప్పనిసరి చేస్తూ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSTDC) సహకారంతో పని చేయాలని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో హైదరాబాద్ గోల్ఫ్ కోర్సు యొక్క మరింత అభివృద్ధిపై మంత్రి చర్చించారు. తమ నియంత్రణలో ఉన్న హైదరాబాద్ గోల్ఫ్ కోర్సు స్థలాన్ని అప్పగించడానికి అంగీకరించారు. చారిత్రక, పురాతత్వ కట్టడాలకు ఎలాంటి నష్టం జరగకుండా గోల్ఫ్ కోర్టు అభివృద్ధి చేయాలని మంత్రి HGA కమిటీని ఆదేశించారు.

ఇప్పటి నుండి రోజువారీ కార్యకలాపాలు మరియు బోర్డు చర్చలు క్రమం తప్పకుండా ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా కోరారు.

More Press Releases