మూసి పాపం నాటి పాలకులదే: మంత్రి జగదీష్ రెడ్డి
- ఏలిన నాటి శని పీడ విరుగడయింది
- ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే మూసి ఆయకట్టు సుభిక్షం
- సమైక్య పాలనలో మూసిని పట్టించుకున్న పాపాన పోలేదు
- 21 కోట్లతో మరమ్మతులు చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే
- అటు కాళేశ్వరం ఇటు మూసిలతో సస్యశ్యామలంగా సూర్యపేట జిల్లా
- కృష్ణా, గోదావరి జలాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా వరి దిగుబడి లో ఫస్ట్
- మూసి కుడి ఎడమల ఆయకట్టుకు నీటి విడుదల
- గేట్లు లేపి నీటి విడుదల చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
- హాజరైన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య
రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తో కలసి నీటి విడుదల చేసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 8 వేలపై క్యూసెక్కుల ఇన్ ఫ్లోతో నిండిన మూసి ఆయకట్టు నుండి నీటి విడుదల ద్వారా 30 వేల పైచిలుకు భూములకు నీరు సమృద్ధిగా అందుతుందన్నారు. సీమాంధ్ర పాలనలో మూసిని పట్టించుకున్న పాపాన పోలేదని ఆ పాపం మూసి ఆయకట్టు రైతాంగానికి శాపంగా పరిణమించిందన్నారు.
అటువంటి దుర్భర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని 21 కోట్లతో మరమ్మతులు చేపట్టడంతో ఆయకట్టు సస్యశ్యామలమయిందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయకట్టు రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. అటు కాళేశ్వరం ఇటు మూసిలతో పరుగులు పెడుతున్న నీటి ప్రవాహం జిల్లా రైతాంగానికి వరంగా మారిందన్నారు. కృష్ణా, గోదావరి జలాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా గడిచిన యాసంగి సీజన్ లోనూ వరి దిగుబడిలో సింహ భాగంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు.
ఒకవైపు ఫ్లోరోసిస్ విజృంబించడంతో త్రాగు నీటికి ప్రాజెక్ట్ లపై నాటి పాలకుల నిర్లక్ష్యంతో సాగునీటికి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు అరిగోసా పడ్డారన్నారు. అటువంటి పాలనకు చరమ గీతం పాడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజుగా మార్చలన్న సంకల్పంతో ఇంజినీర్ అవతారమెత్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి పూర్తి చేశారన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో డిసియంయస్ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ వట్టి జానయ్య యాదవ్, స్థానిక జడ్పిటిసి జీడీ బిక్షం, యంపిపి బీరవోలు రవిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.