ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ కు అనుసంధానంగా మినీ ట్యాంక్ బండ్!

Related image

ఖమ్మంకు మరో మణిహారం ఆవిష్కృతం కాబోతోంది. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ కు అనుసంధానంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో మినీ ట్యాంక్ బండ్ నిర్మితమవుతుంది. ఎంతో విశిష్టత కలిగిన పాత లకారం పార్క్ ను కలుపుతూ మినీ లకారం ట్యాంక్ బండ్ తో ఆధునికరిస్తున్నారు. కొనసాగుతున్న వాకింగ్ ట్రాక్, మినీ గార్డెన్, బోటింగ్, చుట్టూ ఫెన్సింగ్, చిన్నపిల్లకు ఆట స్థలం, గ్రీనరీ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ RV కర్ణన్ తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. వారి వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మేయర్ పాపాలాల్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్ లు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

Puvvada Ajay Kumar

More Press Releases