కోవిడ్ నిర్ధారణ పరిక్షాల కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ మంత్రి

Related image

ఖమ్మం: రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 10 వేల ర్యాపిడ్ యాంటీజేన్ టెస్ట్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు సోమవారం గాంధీచౌక్ లోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన Covid-19(ర్యాపిడ్ యాంటీజేన్ టెస్ట్) నిర్ధారణ పరిక్షాల కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అవసరమైన వారికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఉన్నవారు ఆ అవకాశాన్ని సద్వినియోగించుకోవలని కోరారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, DM&HO మాలతి వైద్య సిబ్బంది ఉన్నారు.

పాలేరు నియోజకవర్గం మద్దులపల్లి గ్రామంలో గల గిరిజన యువత శిక్షణా కేంద్రం(ITDA) లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఎవరు భయాందోళనకు గురికావాల్సిన పని లేదన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా అదనంగా ఇక్కడ 70, మమత ఆసుపత్రిలో 130 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, శారదా ఇంజనీరింగ్ కళాశాలలో కూడా కోవిడ్ హెల్త్ కేర్ ఏర్పాటు చేస్తామన్నారు. అసత్య ప్రచారాలు నమ్మవద్దని తెలంగాణలో కరోనా బారిన పడి నయం అయిన వారి సంఖ్య 98.5% ఉండగా, మరణాలు 1.5% మాత్రమే అన్నారు. కరోనా పై పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుధ్యం సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, DM&HO మాలతి తదితరులు ఉన్నారు.

More Press Releases