బాపు ఘాట్ ను సందర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని బాపు ఘాట్ ను సందర్శించారు. రాష్ట్ర పురపాలక, పరిశ్రమల మరియు IT శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు HMDA, GHMC మరియు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లంగర్ హౌస్ లోన్న బాపు ఘాట్ ను సుందర పర్యాటక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకులను, గాంధేయవాదులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
అంతే కాకుండా బాపు ఘాట్ లో ఉన్న పురాతన బావి, ధ్యాన కేంద్రం, ల్యాండ్ స్కెపింగ్, గార్డెనింగ్, ఫూట్ పాత్ ల అభివృద్ధి, ఓపెన్ ఆడిటోరియం లతో పాటు బాపు ఘాట్ కు అనుకోని దహన వాటిక ఘాట్ లను మూసీ కాలువకు అటువైపుకు షిఫ్ట్ చేసి మహా ప్రస్థానం మాదిరిగా తీర్చిదిద్ది అన్ని సౌకర్యాలు అనగా వాష్ రూమ్ లు, వాటర్ సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ MD మనోహర్,HMDA అధికారులు, GHMC సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, GHMC జోనల్ కమిషనర్ ప్రావీణ్య మరియు ఇంజినీరింగ్ అధికారులతో పాటు కన్సల్టెంట్స్ ఆనంద్ లు పాల్గొన్నారు.