కరోనా సమయంలో గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటించండి: డాక్టర్ బి.రాధిక‌

Related image

  • డాక్టర్ బి.రాధిక‌ కన్సల్టెంట్ ఒబెస్ట్ట్రిక్స్ & గైనకాలజీ కిమ్స్ ఐకాన్‌ హాస్పిటల్, వైజాగ్‌
గర్భిణీ స్త్రీలు మరియు ప్రసవానికి దగ్గరలో ఉండే మహిళలు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు డాక్టర్ల సూచనల మేరకు పరీక్షలకు హాజరుకండి. కరోనా కోవిడ్-19 వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తిస్తోంది. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా గుర్తించింది.

ఇది కొత్త వైరస్ కాబట్టి ఇది గర్భిణీ స్త్రీలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ చైనాలోని కరోనా ప్రభావిత రోగుల అనుభవం మరియు తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యానికి కారణమయ్యే ఇతర వైరస్ల పరిజ్ఞానం నుండి గర్భిణీ స్త్రీలు సాధారణ జనాభా కంటే కోవిడ్-19 సంక్రమణకు గురయ్యే అవకాశం కాస్త ఎక్కువగా ఉందని కనుగొనబడింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నుండి గర్భిణీ స్త్రీలు మరణించినట్లు నివేదించబడలేదు.

గర్భిణీలపై కోవిడ్-19 ప్రభావం:

గర్భిణీ స్త్రీలు సాధారణ జనాభా కంటే కోవిడ్-19 బారిన పడే అవకాశం లేదు. గర్భధారణలో ఇప్పటివరకు కోవిడ్-19 నివేదించబడిన కేసులు మంచి రికవరీ రేట్లు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలకు గుండె జబ్బులు మరియు ఊబ‌కాయం స‌మ‌స్య‌లు ఎక్కువగా ఉంటాయి. కరోనా వైరస్ మహమ్మారి భయం వల్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల మహిళలకు ఒత్తిడికి గురికాకుండా ఉండడం చాలా ముఖ్యం.

ఒకరి నుండి ఒకరికి వ్యాధి ప్రబలడం:

వ్యాధి సోకిన వ్యక్తి దగ్గు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి వచ్చిన శ్వాస బిందువుల ద్వారా ఈ వైరస్ ఒకరి నుండి మరోకరికి వ్యాపిస్తుంది. వైరస్ ఉన్న వ్యక్తి ఉపరితలాన్ని లేదా రోగి తాకిన వస్తువులు, తాకిన చోట్లను ఎవరైనా తాకినప్పుడు కూడా వ్యాధి వ్యాపిస్తుంది.

కరోనా వైరస్ ప్రమాదాన్ని ముందస్తుగా గర్బిణీలు ఎలా తగ్గించగలరు:

సాధారణ సూచనలు - సాధారణ జనాభా మాదిరిగానే, మీరు బహిరంగ ప్రదేశాల నుండి మీ ఇంటికి లేదా కార్యాలయానికి వచ్చిన వెంటనే సబ్బు మరియు నీరు లేదా ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శాంటిజర్ తో మీ చేతులను క్రమం తప్పకుండా మరియు శుభ్రంగా కడగడం చాలా ముఖ్యమైన విషయం.

  • కళ్ళు, నోరు మరియు ముక్కును తరచుగా తాకకుండా ఉండండి.
  • దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు టిష్యూ లేకపోతే మీ మోచేయిని అడ్డుపెట్టుకొండి.
  • బహిరంగా సమావేశాలకు వెళ్లకండి.
  • వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి సామాజిక దూరం చాలా ముఖ్యం.
  • ప్రజా రవాణాను ఉపయోగించవద్దు.
  • రోగనిరోధక వ్యవస్థని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో హైడ్రేషన్ మరియు తగినంత విశ్రాంతి కూడా ముఖ్యమైనవి.
కోవిడ్ -19 యొక్క సమయాలలో యాంటెనాటల్ కేర్:

గర్భిణీలు 12,20,28,36 వారాలలో కనీస సందర్శనలతో, ప్రసూతి సంరక్షణకు హాజరుకావాలి. ప్రతి రోజు పిండం కదలికలను తనిఖీ చేయాలి. టెలిహెల్త్ సేవలను సాధ్యమైనంతవరకు వినియోగించాలి.

కోవిడ్-19 మరియు గర్భదారణ:

సిడిసి ప్రకారం, కోవిడ్-19 బారిన పడిన గర్భిణీలకు గర్భస్రావం లేదా పిండం క్రమరాహిత్యాలు వంటి ఇతర సమస్యలు వచ్చే అవకాశం లేదు. సార్స్ మరియు ఏంఈఎస్ వంటి ఇతర కరోనా వైరస్ల నుండి వచ్చిన డేటా ఆధారంగా, కోవిడ్-19 సోకిన గర్భిణీ స్త్రీలకు ముందస్తు జననం వంటి కొన్ని సమస్యలకు ఎక్కువ ప్రమాదం ఉందని గుర్తించబడింది. అయితే డేటా చాలా తక్కువగా ఉంది. కోవిడ్-19 సంక్రమణ ప్రస్తుతం కోవిడ్ సోకిన వారు ఆబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు.

తల్లిపై ప్రభావాలు:

కోవిడ్-19 ఉన్న మహిళల్లో ఎక్కువమంది తేలికపాటి లేదా మితమైన జలుబు /ఫ్లూ, నిరంతర దగ్గు, కండరాల బలహీనత హై గ్రేడ్ జ్వరాలు వంటి ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి.  తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే తీవ్రమైన లక్షణాలు న్యుమోనియా, శ్వాస ఆడకపోవడం, రోగి ఇకపై లక్షణాలను ఎదుర్కోలేకపోవడం. ఇటువంటి తీవ్రమైన లక్షణాలు వృద్ధులలో, రోగనిరోధక శక్తి లేనివారిలో మరియు డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి వంటి వ్యాధులు ఉన్న వారిలో కనిపిస్తాయి.

పిండంపై ప్రభావాలు:

కోవిడ్-19 బారిన పడిన మరియు లక్షణాలను కలిగి ఉన్న తొమ్మిది మంది గర్భిణీ స్త్రీలపై జరిపిన అధ్యయనంలో వారి పిల్లలు ఎవరూ వైరస్ బారిన పడలేదని తేలింది. వైరస్ ఉమ్మినీరులో, పిల్లల గొంతులో లేదా తల్లి పాలలో వైరస్ గుర్తించినట్లు ఆధారాలు లేవు. పిండ సంక్రమణన జరిగే ప్రమాదం చాలా తక్కువ అనిపిస్తోంది. మరియు కోవిడ్-19 తో ప్రసూతి సంక్రమణ వలన పిండం యొక్క వైకల్యాలు లేదా ప్రభావాలకు ఎటువంటి ఆధారాలు లేవు.

కోవిడ్ -19 మరియు ప్రసవం:

ముందు జాగ్రత్త విధానంగా గర్భిణీ ప్రసవానికి వెళ్ళినప్పుడు అనుమానాస్పద లేదా ధృవీకరించబడిన కరోనావైరస్ కేర్ ప్రసూతి విభాగాన్ని అటెన్ట్ చేయమని సలహా ఇస్తారు. ఆసుపత్రిలో శిశువును నిరంతరం పర్యవేక్షించవచ్చు మరియు రోగికి ఆక్సిజన్ స్థాయిని గంటకు పర్యవేక్షించవచ్చు. అందువల్ల ప్రస్తుతం ఇంటి దగ్గర ప్రసవానికి డాక్టర్లు సిఫారసు చేయడం లేదు. సాధారణ జననం కంటే సిజేరియన్ చేయటం సురక్షితమని సూచించడానికి ప్రస్తుతం ఆధారాలు లేవు. అయితే బాధిత వ్యక్తి యొక్క శ్వాసకోశ పరిస్థితి అత్యవసర డెలివరీ అవసరమని సూచిస్తే సిజేరియన్ చేయాలని సిఫారసు చేయవచ్చు.
 
నవజాత శిశువు సంరక్షణ:

అనుమానాస్పద లేదా ధృవీకరించబడిన కోవిడ్-19 ఉన్న మహిళల పిల్లలందరికీ కూడా పరీక్షించవలసి ఉంటుంది. వ్యాధి సోకిన తల్లి మరియు ఆమె బిడ్డను 14 రోజులు వేరుచేయాలి.

తల్లిపాలు:

తల్లి పాలివ్వటానికి ప్రధాన ప్రమాదం బాధిత మరియు బిడ్డల మధ్య సన్నిహిత సంబంధం. ఎందుకంటే అందువల్ల అవి ఇన్ఫెక్టివ్ గాలి బిందువులను వ్యాపించవచ్చు. తల్లి నుండి శిశువుకి సంక్రమించే అవకాశం ఉంది.

మీరు బిడ్డకు పాలు ఇవ్వాలి అనుకుంటే ఈ జాగ్రత్తలు తీసుకొండి:

  • శిశువు, రొమ్ము పంపులు లేదా సీసాలను తాకే ముందు చేతులు కడుక్కోవాలి.
  • తల్లి పాలిచ్చేటప్పుడు ఫేస్ మాస్క్ తప్పకుండా ధరించాలి.
  • తల్లికి లేదా శిశువుకు దగ్గు లేదా తుమ్ములు వస్తున్నప్పుడు దూరంగా ఉండండి.
  • మీరు శిశువుకి డబ్బా పాలతో ఆహారం ఇవ్వాలి అనుకుంటే, స్టెరిలైజేషన్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సిఫార్సు చేయబడింది.
  • కరోనావైరస్ సంక్రమణ నుండి సురక్షితంగా ఉండండి.
  • వైరస్ గురించి అన్ని విషయాలు తెలుసుకొండి, ఎమైన లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.
  • మీరు మరొకరికి మద్దతు ఇవ్వండి.
  • కోవిడ్-19తో పోరాడటానికి సిద్ధంగా ఉండండి.

More Press Releases