కేంద్రమంత్రితో తెలంగాణ మంత్రి వీడియో కాన్ఫరెన్స్
కేంద్ర క్రీడా మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దక్షిణాది రాష్ట్రాల క్రీడా మరియు యువజన సర్వీసుల శాఖల మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, యువజన సర్వీసులు, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయం నుండి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు క్రీడల అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారన్నారు.
కేంద్ర క్రీడా మరియు యువజన సర్వీసుల శాఖ నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర క్రీడా మరియు యువజన సర్వీసుల మంత్రి కిరణ్ రిజిజుని ఈ సందర్భంగా కోరారు.
రాష్ట్రంలో క్రీడాకారులకు 2 శాతం ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించటంతో పాటు ఉన్నత విద్య అభ్యసించి క్రీడాకారుల కొసం 0.5 శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 250 ఎకరాలు విస్తీర్ణంలో క్రీడా పాఠశాల ఉందన్నారు. క్రీడా పాఠశాలలో మౌళిక వసతులను కల్పించి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యసాచి ఘోష్, క్రీడా, టూరిజం మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సంయుక్త కార్యదర్శి కే.రమేష్, NYKS డైరెక్టర్ అన్షుమన్ ప్రసాద్ దాస్ మరియు సెట్విన్ ఎండీ వేణు గోపాల్, క్రీడా, యువజన శాఖ ఉన్నతాధికారులు సుజాత, విమాలాకర్, ధనలక్ష్మి, చంద్రారెడ్డిలు పాల్గొన్నారు.