నగరంలో 60 శ్మశానవాటికలను అభివృద్ది చేస్తున్న జీహెచ్ఎంసీ: మేయర్ బొంతు రామ్మోహన్
- ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీతో కలిసి మల్కం చెరువు వెనుకవైపు ఉన్న శ్మశానవాటికను పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్
ఈ సందర్భంగా ప్రతిపాదిత రోడ్డు విస్తరణకు హౌసింగ్ బోర్డు భూమికి మధ్య ఉన్న శ్మశానవాటికను పరిశీలించారు. ఈ శ్మశానవాటికకు అందుబాటులో ఉన్న జీహెచ్ఎంసీ భూమిని కొంత కలపడంతో పాటు హౌసింగ్ బోర్డు స్థలానికి హద్దులు నిర్థారించి ప్రహరీ గోడను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శ్మశానవాటికకు విద్యుత్, విద్యుత్ లైటింగ్, త్రాగునీరు సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపారు.
అదే విధంగా సమీపంలో ఉన్న కాలనీవాసుల సౌకర్యార్థం రెండు అంతర్గత రోడ్లు, ఒక నాలాను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాల నిమిత్తం 100 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి సహకరించాలని బస్తీవాసులను కోరారు. ఈ అంశంలో బస్తీవాసులు చర్చించుకొని ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. ఈ పర్యటనలో ఇ.ఇ వెంకటేశ్వర్లు, ఎ.కె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.