కోవిడ్ -19 పాజిటీవ్ పేషంట్ల‌కు హోం ఐసోలేష‌న్ కిట్లు: జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్

Related image

  • కోవిడ్ -19 పాజిటీవ్ పేషంట్ల‌కు హోం ఐసోలేష‌న్ కిట్‌లు - జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డీఎస్‌ లోకేష్ కుమార్‌
  • ఇప్ప‌టి వ‌ర‌కు 15వేల కిట్‌ల పంపిణీ
  • అందుబాటులో మ‌రో 5వేల కిట్‌లు
  • హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారంద‌రికీ కిట్‌లు అందిస్తాం
హైద‌రాబాద్‌, జూలై 13: కోవిడ్‌-19 పాజిటీవ్ గా నిర్థార‌ణ అయిన‌ప్ప‌టికీ ఇంటి వ‌ద్ద‌నే ఉంటూ వైద్య సేవ‌లు పొందుతున్న వారికి హోం ఐసోలేష‌న్ కిట్‌ల‌ను అంద‌జేస్తున్న‌ట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డీఎస్‌ లోకేష్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జీహెచ్ఎంసీ ద్వారా 20వేల హోం ఐసోలేష‌న్ కిట్‌ల‌ను తెప్పించిన‌ట్లు తెలిపారు. వాటిలో 15వేల హోం ఐసోలేష‌న్ కిట్‌ల‌ను పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు.

మ‌రో 5వేల కిట్‌లు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు. కేసుల సంఖ్య‌ను బ‌ట్టి హోం ఐసోలేష‌న్ కిట్‌ల‌ను తెప్పించి అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాల ప్ర‌కారం 17 రోజుల పాటు హోం ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని తెలిపారు. అందుక‌నుగుణంగా తొంద‌ర‌గా కోలుకునేందుకు దోహ‌ద‌ప‌డే తొమ్మిది ర‌కాల వ‌స్తువులు ఇస్తున్న‌ట్లు తెలిపారు.

ప్ర‌తి కిట్‌లో విట‌మిన్‌-సి టాబ్లెట్లు-34, జింక్ టాబ్లెట్లు-17, బికాంప్లెక్స్ టాబ్లెట్లు -17, శానిటైజ‌ర్ బాటిల్‌‌-1, హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్‌-1,  గ్లౌజ్‌లు, సోడియం హైపోక్లోరైట్ ద్రావనంతో పాటు హోం ఐసోలేష‌న్ బ్రోచ‌ర్‌ను ఇస్తున్న‌ట్లు తెలిపారు. హోం ఐసోలేష‌న్ కిట్ క‌వ‌ర్‌పై ఉన్న క్యూ.ఆర్ కోడ్ ను సెల్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే కేంద్ర ప్ర‌భుత్వం కోవిడ్‌-19 నియంత్ర‌ణ‌కు జారీ చేసిన స‌ల‌హాలు, సూచ‌న‌లు ల‌భిస్తాయ‌ని తెలిపారు.

జీహెచ్ఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటి క‌మిష‌న్లు ఆయా ప్రాంతాల మెడిక‌ల్ ఆఫీస‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆరోగ్య సిబ్బందిచే పాజిటీవ్ కేసులు న‌మోదైన ఇళ్ల‌లో నేరుగా అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

More Press Releases