లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన మంత్రి పువ్వాడ

Related image

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 కోట్ల 50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం వి.డి.ఓస్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 63 మందికి (సి.ఎం.ఆర్.ఎఫ్) ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సుమారు 26 లక్షల రూపాయల విలువ గల చెక్కులను మంత్రి లబ్దిదారులకు అందజేశారు. వివిధ రకాల చికిత్సల కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం కొరకు లబ్ధిదారుల చేసుకున్నటువంటి దరఖాస్తులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు. అట్టి చెక్కులను మంగళవారం మంత్రి లబ్దిదారులకు అందజేశారు. శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ నగర పాలక సంస్థ మేయర్ డా॥పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, సంబంధిత డివిజన్ల కార్పోరేటర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మొక్కలు నాటిన మంత్రి:ఆరవ విడత హరితహారంలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్తో కలిసి మొక్కలు నాటారు 22వ డివిజన్ చైతన్య నగర్ కాలనీ-2లోని కాలువ గట్టుపై, 8వ డివిజన్ గొల్లగూడెం రోడ్ నందు మంత్రి మొక్కలు నాటారు. వన సంపదను పెంపొందించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్రంలో అటవీ సంపదను మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుందని, హరితహారంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని జిల్లాను పచ్చని జిల్లాగా మార్చడంలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, నగర మేయర్ డా॥ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ, నగరపాలక సంస్థ కార్పోరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases