'పీ.వీ తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీ' ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి తలసాని

Related image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం మరియు 'శ్రీ.పి.వి.నర్సింహారావు శతజయంతి' కార్యక్రమాలలో భాగంగా ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని 'పీ.వీ తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీ' ఆవరణలో పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రలతో కలసి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశువైద్య మరియు పశుసంవర్ధక  సంచాలకులు డా. వి.లక్ష్మా రెడ్డి, వెటర్నరీ కాలేజీ అసోసియేట్ డీన్ డా,,ప్రమోద్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రారెడ్డి:

ఆర‌వ విడ‌త‌ తెలంగాణ‌కు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో పాల్గొని, ప్రజలందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణ రాష్ట్రం చేప‌ట్టిన  అనేక పథకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు అమలు చేయడం మనకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రధానమైన కార్యక్రమం తెలంగాణకు హరితహారం. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పాటు అయిన తొలినాళ్లలోనే హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణకు హరితహారం పేరిట ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నానికి ఐదేండ్ల కింద‌ట‌ సీఎం కేసీఆర్ బీజం వేశారు.
 
ముఖ్యమంత్రి దూరదృష్టికి, ప్రణాళికకు అనుగుణంగా అందరి సహకారంతో గత ఐదేళ్లుగా రాష్ట్రంలో హరిత హారం ఓ ఉద్యమంలా కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్య‌క్ర‌మం రాష్ట్రంలో సత్ఫలితాలను ఇస్తోంది. పట్టణాలు, గ్రామాల్లో హరిత హారంలో నాటిన మొక్కలు పెరిగి నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని అన్నారు.

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. హ‌రితహారం కార్య‌క్ర‌మంతో పాటు సీఎం కేసీఆర్ గారి మార్గనిర్ధేశనంలో రాష్ట్రం ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మకమైన పంచాయతీరాజ్, పురపాలక చట్టాలతో పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. నాటిన మొక్కలలో కనీసం 85 శాతం మొక్కలను కాపాడే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంద‌ని చట్టంలో పేర్కొన్నారు. గ్రామ పంచాయ‌తీల్లో, పట్టణాల్లో పచ్చదనానికి పది శాతం నిధులు కేటాయించారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో ప్రతి గ్రామ పంచాయతీలో న‌ర్స‌రీల‌ను ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. ప‌చ్చ‌ద‌నం - ప‌రిశుభ్ర‌త కోసం ప్ర‌తి గ్రామ‌ పంచాయతీకి ట్రాక్టర్లను కూడా సమకూర్చిందన్నారు.

ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆర‌వ విడ‌త హరితహారం కార్య‌క్ర‌మాన్ని ప్రజలను భాగస్వామ్యం చేస్తూ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నాటిన మొక్క‌ల‌ను సంర‌క్షించేలా చూడాల‌ని విద్యాశాఖ మంత్రి పట్లోల సబితా ఇంద్రరెడ్డి అన్నారు.

More Press Releases