శానిటేష‌న్, ఎంట‌మాల‌జి సిబ్బందికి 'పీపీఈ సేఫ్టీ కిట్స్' పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్

Related image

  • పాల్గొన్న న‌గ‌ర‌ మేయర్ బొంతు రామ్మోహన్, మూసి రివర్ డెవలప్మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, కార్పొరేట‌ర్ సంగీత‌, కమీషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్
హైద‌రాబాద్‌, జూలై 06: కోవిడ్ -19 నియంత్రణలో జీహెచ్ఎంసీలోని శానిటేషన్, ఎంటమాలజీ, డి.ఆర్.ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అభినందించారు. సోమవారం ఫతుల్లాగూడలోని యానిమల్ కేర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శానిటేషన్, ఎంట‌మాలజీ సిబ్బందికి "పీపీఈ సేఫ్టీ కిట్స్"పంపిణీ చేశారు.

ప్రస్తుతం రూ.13 కోట్ల వ్యయంతో 22 వేల మంది శానిటేషన్, 2500 మంది ఎంటమాలజీ సిబ్బందికి పీపీఈ సేఫ్టీ కిట్స్ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. కిట్స్ ను రెగ్యులర్ గా వినియోగించాలని సిబ్బందికి మంత్రి కేటీఆర్ సూచించారు. కోవిడ్ -19 వ్యాప్తిని అరిక‌ట్టుట‌లో శానిటేష‌న్‌, ఎంట‌మాల‌జి సిబ్బంది సేవ‌ల‌ను గుర్తించి ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల ఆరోగ్యం, ర‌క్ష‌ణ‌తో పాటు కుటుంబ స‌భ్యులు ఆరోగ్యాన్ని కాపాడుట‌కు ఇంటి వ‌ద్ద కూడా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని తెలిపారు.\

గతంలో అత్యవసరంగా 1, 80, 000 మాస్కులు, 27 వేల హ్యాండ్ గ్లోవ్స్, 25 వేల లీటర్లు హ్యాండ్ శానిటైజర్ ను శానిటేషన్, ఎంట‌మాలజీ సిబ్బందికి సర్కిళ్ల వారిగా పంపిణీ చేసిన‌ట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ మంత్రికి వివ‌రించారు. మూడు వారాల్లో అందరికి పీపీఈ సేఫ్టీ కిట్స్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా యానిమల్ కేర్ సెంట‌ర్ నిర్వ‌హ‌ణ‌ను మంత్రి ప‌రిశీలించారు. అదే విధంగా ఎంట‌మాల‌జి విభాగం ఏర్పాటు చేసిన దోమ‌ల నివార‌ణ స్టాల్‌ను సంద‌ర్శించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, మూసి రివర్ డెవలప్మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, కార్పొరేట‌ర్ సంగీత‌, కమీషనర్ డిఎస్ లోకేష్ కుమార్, ఈ వి డి ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అదనపు కమీషనర్ రాహుల్ రాజ్ జెడ్ సి ఉపేందర్ రెడ్డి, చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు పాల్గొన్నారు.

KTR

More Press Releases