కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీకై చొర‌వ తీసుకోండి: మంత్రి కేటీఆర్ కి వినతి

Related image

కేటీఆర్ ని క‌లిసి విన్న‌వించిన ప్ర‌భుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు*
హైద‌రాబాద్, జులై 3ః కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ కై చొర‌వ తీసుకోవాల‌ని కోరుతూ, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి క‌ల్వ‌కుంట్ల రామారావుని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు క‌లిశారు. ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీ‌నివాస‌రెడ్డి, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్ లు ఈ మేర‌కు కేటీఆర్ ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో శుక్రవారం క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా కాజీపేట రైల్వే కోచ్ వ‌రంగ‌ల్ ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ అని, అనేక పోరాటాలు చేసినా మంజూరు ఇవ్వ‌డం లేద‌న్నారు. అందుకు అవ‌స‌ర‌మైన భూమిని కూడా సిద్ధం చేశామ‌ని వారు కేటీఆర్ కి వివ‌రించారు. కేంద్రంతో మాట్లాడి, అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, కాజీపేట‌లో కోచ్ ఫ్యాక్ట‌రీ ప‌డితే, ఇక్క‌డి యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తుంద‌ని, ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్య‌త ఏర్ప‌డుతుంద‌ని వారు చెప్పారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి కూడా మంచిపేరు వ‌స్తుంద‌ని వారు అన్నారు. ఈ మేర‌కు ఓ విన‌తి ప‌త్రాన్ని కేటీఆర్ కి అంద‌చేశారు.

KTR

More Press Releases