15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై మార్గదర్శకాలు విడుదల
- మూడంచెల పంచాయతీరాజ్ వాటాల వినియోగం 85, 15, 5శాతం
- సీఎం కేసీఆర్, మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ పోచంపల్లి
- సీఎం కేసీఆర్ సూచనల మేరకే కేంద్రం ఆదేశాలు, ఆ మేరకే నిధుల పంపిణీ: మంత్రి ఎర్రబెల్లి
- రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లిని కలిసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
ఈ సందర్భంగా ముందుగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం నిధుల వినియోగం మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలకు 85శాతం. మండల ప్రజా పరిషత్ లకు 15శాతం, జిల్లా పరిషత్ లకు 5శాతం నిధులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నిధులతో పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ అభివృధ్ధి చెండానికి వీలవుతుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి పథకాలతోపాటు ఇతరత్రా నిధులు దండిగా కేటాయిస్తున్నదన్నారు.
కాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీ విషయమై తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసి అభినందించినట్లు చెప్పారు. మన ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థలో పంచాయతీరాజ్ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు గ్రామాలకు 85శాతం, మండలాలకు 15శాతం, జిల్లా పరిషత్ లకు 5శాతం నిధులు సముచిత పంపిణీగా పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థకు తోడ్పడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కి, మంత్రి కెటిఆర్ కి, మంత్రి ఎర్రబెల్లికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లిని కలిసిన సమయంలో ఎమ్మెల్సీ పోచంపల్లితోపాటు, హైదరాబాద్ మహానగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు.