ఈ నెల 25న సత్యం థియేటర్ వద్ద మంత్రి కేటీఆర్ మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు: మంత్రి తలసాని
హైదరాబాద్: ఈ నెల 25 వ తేదీన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్ పేటలో గల సత్యం థియేటర్ వద్ద మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 25 వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగా ghmc ఆధ్వర్యంలో 2.50 కోట్లు, hmda ఆధ్వర్యంలో 5 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళికలను సిద్దం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం బల్కంపేట గ్రేవ్ యార్డ్ లో మొక్కలు నాటుతారని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్వచ్చంద సంస్థల నిర్వహకులు, కాలనీ సంఘాలు భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
మంత్రి తలసాని హరితహారం కార్యక్రమాల వివరాలు:
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నెల 26 వ తేదీ నుండి హరితహారం కార్యక్రమంలో భాగంగా ghmc పరిధిలోని వివిధ నియోజవర్గాలలో పాల్గొని మొక్కలు నాటుతారు. 26 వ తేదీన సనత్ నగర్, ముషీరాబాద్, అంబర్ పేట, 27 వ తేదీన సనత్ నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, 28 వ తేదీన గోషా మహల్, నాంపల్లి, కార్వాన్, 29 వ తేదీన కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, 30 వ తేదీన ఉప్పల్, LB.నగర్, మలక్ పేట నియోజకవర్గాల పరిధిలో పర్యటించి మొక్కలను నాటుతారు.