జిల్లా కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ ఎస్.కె.జోషి వీడియో కాన్ఫరెన్స్!
వ్యవసాయ శాఖ AEO లు గ్రామాల వారీగా , రైతుల వారీగా ప్రతి రోజు నాటిన, వేసిన (Sowing) పంటల వారీ వివరాలను ట్యాబ్ ల ద్వారా పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. మంగళవారం సి.యస్ వివిధ శాఖల అధికారులతో కలసి హరితహారం, వాతావరణ పరిస్థితులు, పెన్షన్ల పంపిణీ, 2021 జనాభా లెక్కల సేకరణ, స్వచ్చభారత్ మిషన్, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రెవెన్యు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, జి.ఎ.డి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారథి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, PCCF పి.కె.ఝా, పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ నీతూ కుమారి, వ్యవసాయ శాఖ కమీషనర్ రాహుల్ బొజ్జా, ప్రొటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, సి.యం ఓఎస్ డి ప్రియాంక వర్గీస్, సెర్ఫ్ సిఈఓ పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు AEO ల కార్యకలాపాలపై Virtual Monitoring చేయాలన్నారు. రైతుల వారీగా వ్యవసాయ శాఖ Data సేకరణ ప్రతి సీజన్ లో Dynamic గా ఉండాలన్నారు. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ గత రెండు రోజులుగా వర్షాలు కురవడం తో వర్షాదార పంటలు 99 శాతం మేరకు సాగయ్యాయని , మేజర్ ప్రాజెక్టులు, చెరువులో నీరు వస్తే వరి పంట సాగు పెరుగుతుందని అన్నారు. AEO లు రైతుల వారిగా, పంటల వారిగా ప్రతి సీజన్ లో విస్తీర్ణం డాటాను సేకరించడం వలన MSP అమలు, online payments, calamity relief తదితర అంశాలలో వినియోగించుకోవచ్చని అన్నారు. గత రెండు రోజుల వర్షాలతో కొన్ని మండలాలలో పరిస్థితి మెరుగైందన్నారు.
జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా మాట్లాడుతూ 2021 సెన్సస్ కు సంబంధించి గ్రామ, పట్టణ రిజిష్టర్ లను పంపడంతో పాటు Urban agglomeration వివరాలను పంపాలన్నారు. వరంగల్ అర్బన్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జిల్లాల్లో 2021 జనాభా లెక్కల ప్రి టెస్ట్ నిర్వహణకు ఇన్ స్ట్రక్షన్స్ (Instructions) పంపామని ఎన్యుమరేటర్ల ఎంపిక, శిక్షణ ను పూర్తి చేయడంతో పాటు Houses listing, House wise Examination చేపట్టవలసి ఉంటుందన్నారు. సెన్సస్ శాఖ రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్ ను ఉపయోగించుకోవాలన్నారు.
వాణిజ్యపన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ కొత్త Excise Policy అక్టోబర్ 1 నుండి ప్రారంభం కానున్నందున గిరిజన ప్రాంతాలలో ఉన్న 109 షాపులకు సంబంధించి PESA Act ప్రకారం గ్రామ సభ రిజల్యూషన్స్ పొందే పనులను పదిహేను రోజులలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను కోరారు. భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబుబాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ ఆగస్టు,15 నాటికి జిల్లాలలో టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ODF గా ప్రకటించే ముందు టాయిలెట్లను Geo tagging చేయాలన్నారు. రూర్బన్ కు సంబంధించి ప్రత్యేకంగా సమీక్షించాలని భూ కేటాయింపులను పూర్తి చేసి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పనులు చేపట్టాలన్నారు. Critical gap Findings సంబంధించి పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చే పనులు చేపట్టాలన్నారు. ఎకనామిక్ ఆక్టివిటీస్ కు మంజూరు ఇవ్వాలన్నారు. టాయిలెట్ల నిర్మాణం, మంచినీటి సరఫరా, సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మెనేజ్ మెంట్, వీధి దీపాలు, ఎల్ పిజి మంజూరు, స్కిల్ డెవలప్ మెంట్ తదితర ప్రాధాన్యత పనులను చేపట్టాలన్నారు. గ్రామ పంచాయితీలకు సంబంధించిన సమాచారాన్ని E-Panchayat Software లో feed చేయాలన్నారు. ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ సమాచారాన్ని feed చేయాలన్నారు. ఈ అంశంపై DPO లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సమీక్షించాలన్నారు.
రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ మాట్లాడుతూ జిల్లా రోడ్ సేఫ్టి కమిటి సమావేశాలు నిర్వహించి మినిట్స్ పంపాలని జిల్లా కలెక్టర్లను కోరారు. జిల్లాలలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఆర్ అండ్ బి, పోలీస్, ట్రాన్స్ పోర్టు తదితర అధికారులతో కూడిన కమిటీలను ప్రమాద స్ధలాల వద్దకు పంపి పరిస్ధితిని అంచనావేయడంతో పాటు, బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి తగు మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు.
ఐదో విడత హరితహారంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, సచివాలయ ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తున్నందున తెలంగాణకు హరితహారం ముమ్మరంగా కొనసాగేలా చూడాలని చీఫ్ సెక్రటరీ డా.ఎస్.కె జోషి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తగిన ఎత్తులో ఉన్న మొక్కలు నాటడంతో పాటు వాటి రక్షణకు, నీటి వసతి కల్పనకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. మొక్కలు నాటడంలో సంఖ్య కన్నా, వాటిని బతికించే శాతం పెంపుపైన ప్రధానంగా అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని చీఫ్ సెక్రటరీ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న మొక్కలు నాటొద్దని, తగిన ఎత్తులో ఉన్న మొక్కలు నాటితేనే బతికేశాతం ఆ మేరకు పెరుగుతుందని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా సూచించారు. మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకం, మొక్కలు నాటడం వెనువెంటనే జరిగితే, వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తెలిపారు.
నాలుగు విడతల తర్వాత తెలంగాణకు హరితహారం ఫలితాలపై జనంలో మంచి స్పందన కనిపిస్తోందని, రాష్ట్రాన్ని పచ్చదనం చేసే ఈ ప్రక్రియ కొనసాగాలని, అన్ని శాఖల మధ్య సమన్వయంతో పాటు, ఆయా శాఖలు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను కూడా వారే పర్యవేక్షిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) పీకే ఝా అన్నారు. మొక్కలు నాటే ప్రాంతాలను తప్పనిసరిగా జీయో ట్యాగింగ్ చేయాలన్నారు. అన్ని జిల్లాల్లో మండలాలు, గ్రామ స్థాయి వరకు కొత్త ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బందికి గ్రామీణాభివృద్ది శాఖ హరితహారం అవగాహన, శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందని పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. అటవీ శాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేయటం వల్ల జగిత్యాల జిల్లాలో హరితహారం, అడవుల రక్షణ, గ్రామాల వారీగా అవెన్యూ ప్లాంటేషన్ లో మంచి ఫలితాలు సాధిస్తున్నామని కలెక్టర్ శరత్ సమావేశంలో వెల్లడించారు.
అలాగే కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద హరితహారం కోసం ఏడు కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకున్న మేడ్చెల్ జిల్లా కలెక్టర్ ఎం.వీ. రెడ్డిని అధికారులు అభినందించారు. అన్ని జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థలు, పరిశ్రమలు హరితహారంలో తమవంతు పాత్ర పోషించేలా ప్రోత్సహించాలని చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు సూచించారు. మొక్కల రక్షణ కోసం ఉపాధి హామీ నిధులతో అనుసంధానం చేసి వాచర్లను నియమించాలని సూచించారు. క్షీణించిన అటవీ ప్రాంతాల పునరుజ్జీవనంలో భాగంగా నాటుతున్న మొక్కల్లో అధికశాతం తెలంగాణ ప్రాంత భూములు, వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎదిగే మొక్కలనే నాటాలని తెలిపారు.
ఆలస్యంగానైనా మంచి వర్షాలు కురుస్తున్నాయని ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు, విభిన్న వర్గాలు తెలంగాణకు హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ కోరారు. ఈ నెల 31న (బుధవారం) పదవీ విరమణ చేస్తున్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝాను చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు, కలెక్టర్లు సమావేశంలో అభినందించారు. గత మూడేళ్లుగా తెలంగాణలో అటవీ సంరక్షణ కోసం ఝా నేతృత్వంలో అటవీ శాఖ సమర్థవంతంగా పనిచేసిందని అందరూ చప్పట్లతో శుభాకాంక్షలు తెలిపారు.