సామాన్యుల అరచేతిలో వాతావరణ సమాచారం: వినోద్ కుమార్

Related image

  • "టీఎస్ - వెదర్" మొబైల్ యాప్, పోస్టర్స్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర వాతావరణ సమాచారం, వర్ష సూచన వంటి సమగ్ర వివరాలతో కూడిన మొబైల్ యాప్ ను సామాన్యులకు అరచేతిలోకి అందుబాటులో తీసుకుని వచ్చినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ అధికారిక నివాసంలో ts-weather మొబైల్ యాప్, పోస్టర్స్ ను వినోద్ కుమార్ ఆవిష్కరించారు. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీ.ఎస్.డీ.పీ.ఎస్) ఈ యాప్ ను రూపొందించింది.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రైతులు, ప్రజలకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరమని అన్నారు. వాతావరణ పరిస్థితులు, సూచనలతో రైతులు వ్యవసాయ పనులను, ప్రజలు ప్రయాణాలను కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వివరాలైనా అరచేతిలో క్షణాల్లో అందించే విధంగా ఈ యాప్ ను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వర్స్కు ప్రతీ ఒక్కరికీ ఈ యాప్ ఎంతో దోహదపడుతుందని వినోద్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ డైరెక్టర్ షేక్ మీరా, అర్ధ గణాంక శాఖ డైరెక్టర్, టీ.ఎస్.డీ.పీ.ఎస్. ఇంచార్జీ సి.ఈ.ఓ. దయానంద్, అధికారులు రామకృష్ణ, ప్రసాద్, వేణు మాధవ్, ముకుంద్ రెడ్డి, శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.

More Press Releases