సీఏఏకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపిన మంత్రులు!

Related image

ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టం బిల్లులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపేందుకు దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎం అంజాద్ భాష, విప్ గండికోట శ్రీకాంత్ తదితరులు సీఎంను కలిసి అభినందనలు తెలియజేశారు.

ఈ మేరకు మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టాని (సీఏఏ)కి సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ముస్లిం మైనార్టీల ఆందోళన విషయంలో ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని వెల్లడించారు. వారికి వైసీపీ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని హామీ ఇచ్చారు. వివాదస్పద ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ బిల్లుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, గతంలో పేర్కొన్న విధానానికే తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.

YSRCP
Jagan

More Press Releases