ఆరోగ్య బీమా పాలసీలలో క్రొత్త ప్రయోజనాలను ప్రవేశపెడుతున్న ఐసిఐసిఐ లాంబార్డ్
క్రొత్త/వర్తింపులు/పాలసీ సంబంధిత సడలింపులు అనేవి ఈ కోవిడ్-19 మహమ్మారి పెచ్చుమీరుతున్న సమయంలో వినియోగదారులకు ఉపకరించడానికి తీసుకోబడుతున్న ముందస్తు చర్యలు
సంపూర్ణ ఆరోగ్య బీమాకు క్రొత్త వినియోగదారులు కోవిడ్-19 క్లెయిమ్‌ల కొరకు వేచియుండాల్సిన వ్యవధి 30 రోజుల నుండి 15 రోజులకు తగ్గించబడింది
కోవిడ్-19 హాస్పిటలైజేషన్ క్లెయిమ్ సందర్భంలో సహితం నొ క్లెయిమ్ బోనస్ ప్రయోజనం కొనసాగుతుంది.
ఇంటివద్దే చికిత్స పొందే సంఘటనలకు సంబంధించిన క్లెయిమ్‌లను ప్రక్రియ చేయుట కొరకు హోమ్ హెల్త్‌కేర్ బెనిఫిట్ ప్రవేశపెట్టబడింది
ముంబయి, జూన్ 16, 2020: భారతదేశపు అతి పెద్ద ప్రైవేట్ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో తన హెల్త్ ఇండెమ్నిటీ వినియోగదారుల కొరకు అనేక అఫర్లను విడుదల చేసింది. ఇవి సంస్థ యొక్క ప్రస్తుత ఆరోగ్య బీమా అందిస్తున్న సంపూర్ణ ఆరోగ్య బీమా వంటి ఆఫర్లను మరింత ప్రయోజనకరంగా చేస్తాయి.
కోవిడ్-19 మహమ్మారి మరియు దాని కొరకు విధించిన లాక్‌డౌన్ కారణంగా వినియోగదారులు ఎదుర్కొన్న సవాళ్ళను దృష్టిలో ఉంచుకుని ఈ అదనపు ప్రయోజనాలు మరియు సడలింపులు అందించబడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారుల అనుభవం మరియు ప్రయోజనాలను మరింత అధికం చేయాలని కృషి చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఐసిఐసిఐ లాంబార్డ్ యొక్క ‘నిభాయే వాదే’తత్వానికి అనుగుణంగా ఉండి తన వినియోగదారుల కొరకు వారి అవసరతలో అదనపు శ్రద్ధ వహిస్తుంది.
క్రొత్తగా చేరినవి సంక్షిప్తంగా
కోవిడ్-19 సంబంధిత ఇన్ పేషంట్ క్లెయిమ్‌ల కొరకు క్రొత్త పాలసీల విషయంలో వేచియుండాల్సిన వ్యవధి 15 రోజులకు( ఇదివరకు ఉన్న 30 రోజుల నుండి) తగ్గించబడింది
ప్రీమియంలో ఏ పెంపు లేకుండా ఈ కుదించిన వేచియుండే వ్యవధి అందించబడుతుంది.
ఇది కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ బూస్టర్, హెల్త్‌కేర్ ప్లస్, మరియు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో సహా అన్ని హెల్త్ ఇండెమ్నిటీ పాలసీలకు వర్తిస్తుంది.
ఈ చర్య పాలసీదారునికి సౌలభ్యాన్ని మరియు మనశ్శాంతిని అందిస్తుంది.
హోమ్ హెల్త్‌కేర్ బెనిఫిట్
ఈ ఆఫర్లో భాగంగా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందడం కొరకు వినియోగదారులు కచ్చితంగా హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దనే చిత్సను పొందవచ్చు.
ఇది వారికి వచ్చిన ఏదైనా అస్వస్థతకు హాస్పిటల్‌లో చేరకుండా భౌతిక దూరాన్ని పాఠిస్తూ ఇంటివద్దనే సురక్షిత వాతావరణంలో చికిత్స పొందాలనుకునే వినియోగదారులకు ప్రాముఖ్యంగా ప్రయోజనం చేకూరుస్తుంది.
కోవిడ్-19 సంబంధిత క్లెయిమ్ సందర్భంలో సహితం ‘నో క్లెయిమ్ బోనస్’ను కొనసాగింపు
కోవిడ్-19 సంబంధిత క్లెయిమ్ సందర్భంలో సహితం ‘నో క్లెయిమ్ బోనస్’ అందించడాన్ని సంస్థ కొనసాగిస్తుంది.
ఇన్సూర్డ్ వ్యక్తి ఒకవేళ కోవిడ్-19 కారణంగా హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చినా జమ అయిన అదనపు సమ్ ఇన్సూర్డ్ (ఏఎస్‌ఐ) లో ఏ మార్పులు చోటుచేసుకోవు, తద్వారా ఆ సమయంలో ఎంతో అవసరమైన ఆర్ధిక ఉపశమనాన్ని వినియోగదారులకు అందిస్తుంది.
ఈ ప్రయోజనం ఐసిఐసిఐ లాంబార్డ్ యొక్క కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ బూస్టర్ ప్లాన్లలో అందించబడుతుంది.
ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, సంజీవ్ మంత్రి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐసిఐసిఐ లాంబార్డ్, జీఐసి “ఐసిఐసిఐ లాంబార్డ్ వద్ద, మా వినియోగదారులకు అవసరతలో ఉన్నప్పుడు వారి చేయిపట్టుకోవడాన్ని మేము విశ్వసిస్తాము. కోవిడ్-19 మహమ్మారి క్రొంగొత్త సవాళ్ళను విసరడం కొనసాగుతుండగా, మా వినియోగదారులకు క్రొత్తగా తలెత్తే అవసరాలను ప్రభావవంతంగా తీర్చగలగడానికి మా ఆరోగ్య బీమా పాలును మరింత పూరించడం మాకు ఎంతో ప్రాధాన్యమైన అంశంగా తోచింది. ఏ అదనపు ధర లేకుండా అందించబడే ఈ అదనపు ప్రయోజనాలు మా వినియోగదారులు వారి ఆరోగ్య బీమా వర్తింపు నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందుకునేలా ఛేయగలుగుతాయి”అని అన్నారు.
కోవిడ్-19 మొదలైనప్పటి నుండి తన వినియోగదారులకు ప్రయోజనాన్ని చేకూర్చడానికి ఐసిఐసిఐ లాంబార్డ్ పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒక ప్రత్యేక ‘కోవిడ్-19 ప్రొటెక్షన్ కవర్’ను ప్రవేశపెట్టింది. ఇంకా, సంస్థ తన వినియోగదారులందరికీ వెబ్‌సైట్, మొబైల్ మరియు యాప్‌ల ద్వారా అనేక డిజిటల్ పరిష్కారాలను అందించింది. ఇది పాలసీ కొనుగోలు, రిన్యూవల్, క్లెయిమ్‌లు మొదలగు వాటికి సంబంధించిన తన ప్రక్రియలను మరింత సరళీకృతం చేసింది.
పరిశ్రమలో మొదటి కార్యక్రమాలను తన వినియోగదారులకు అందించడంలో ఐసిఐసిఐ లాంబార్డ్ ఎల్లప్పుడూ ఒక అడుగు ముందే ఉంది, తద్వారా తన ‘నిభాయే వాదే”(వాగ్దానాలను నిలబెట్టుకోవడం) అని పిలువబడే తన విలువలకు కట్టుబడి ఉంది.
గమనిక: మార్చి 31, 2021 వరకు వినియోగదారులకు హోమ్ హెల్త్‌కేర్ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.
About ICICI Lombard General Insurance Company Ltd
We are the largest private sector non-life insurer in India based on gross direct premium income in fiscal 2020 (Source: IRDAI). We offer our customers a comprehensive and well-diversified range of products, including motor, health, crop, fire, personal accident, marine, engineering and liability insurance, through multiple distribution channels. More details are available at www.icicilombard.com.
For details, contact:
ICICI Lombard GIC Ltd.
Seema Jadhav
seema.jadhav@icicilombard.com
Tel: +91 70459 26209