గౌడ సామాజిక వర్గానికి సీఎం కేసీఆర్ ఎంతో చేస్తున్నారు:మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: హన్మకొండలోని హంటర్ రోడ్ లో నూతనంగా నిర్మించిన కాకతీయ గౌడ హాస్టల్ భవనాన్ని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు MLA లు, వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు తదితరులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కామెంట్స్:
- మొదటి నుంచీ గౌడ సామాజిక వర్గం సామాజిక చైతన్యం, కార్యక్రమాల్లో ముందున్నది
- ఆర్థిక, విద్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, ఎదుగుదల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం గర్వకారణం
- వివిధ రంగాల్లో స్థిరపడ్డ వారు, వ్యాపార రంగంలో రాణించిన ప్రతిఒక్కరూ వారి సామాజిక వర్గం అభివృద్ధి కోసం కృషి చేయాలి
- ఐక్యతతో ఇంతపెద్డ కాకతీయ గౌడ హాస్టల్ భవనాన్ని నిర్మించిన గోపా ప్రతినిధులను అభినందిస్తున్నాను
- గౌడ సామాజిక వర్గానికి సిఎం కెసిఆర్ ఎంతో చేస్తున్నారు
- అన్ని సామాజిక వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది
- అన్ని కులాల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకరావడానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారు
- బర్లు, గొర్రెలు, చేపలు, చేతి వృత్తులను ఆదుకోవడం వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారు
- గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఈ స్థాయిలో కుల వృత్తులను ఆదుకున్న సీఎం లేరు
- నేను కూడా నా వంతుగా తగిన సహాయం అందిస్తాను
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్:
- భారీ ఎత్తున ఇంత పెద్ద భవనాన్ని గౌడ సమాజానికి నిర్మించి ఇవ్వడం స్వాగతించదగినది
- ఈ ప్రారంభోత్సవానికి 50 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించలకున్నాం కానీ కరోనా వల్ల నిర్వహించలేక పోయాం
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు సంపూర్ణ చేయూతనుస్తున్నది
- ముఖ్యమంత్రి కేసీఆర్ గీత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారు
- నీరాను త్యరలో అందుబాటులో తీసుకు వస్తాం
- అన్ని కుల వృతులను ప్రభుత్వం అదుకుంటున్నది
- హైదరాబాద్ మహా నగరంలో గౌడ సామాజిక వర్గానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిది
- వరంగల్ కాకతీయ హాస్టల్ లో అన్ని వసతులు కల్పిస్తాము
- కాకతీయ హాస్టల్ ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం
ఉపాధి కూలీలకు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ:
