వినూత్న పద్దతుల్లో బోధనలకు శ్రీకారం చుట్టిన టీ-శాట్ నెట్వర్క్

Related image

  • ప్రభుత్వ ఆన్ లైన్ విద్యాబోధనకు వేదిక కానున్న టీ-శాట్ ఛానళ్లు
  • అనుభవం కలిగిన ప్రయివేటు సంస్థలతో ఎం.ఒ.యు
  • జూన్ 15 నుండి ప్రత్యేక బోధనలు ప్రారంభం - టీ-శాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి
(టీ-శాట్-సాఫ్ట్ నెట్): కోవిడ్-19 ప్రభావం కారణంగా ఆన్ లైన్ విద్యా బోధనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖలు టీ-శాట్ వేదికను ఎంచుకున్నాయి. బోధనలో వినూత్న పద్దతులను అవలంభించేందుకు టీ-శాట్ పలు సంస్థలతో ఎం.ఒ.యు కుదుర్చుకుంది. ఫలితంగా తెలంగాణ విద్యార్థులకు జూన్ 15వ తేదీ నుండి ప్రత్యేక తరహాలోఆన్ లైన్ బోధనలు అందనున్నాయి. టీ-శాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వార ఈ నెల 15వ తేదీ సోమవారం నుండి జరిగే ప్రత్యేక బోధనలకు సంబంధించిన వివరాలను సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి శనివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో వివరించారు.

కోవిడ్ కారణంగా విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఇప్పటికే అందుబాటులో ఉన్న టీ-శాట్ ను వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలు ఎస్సీఈఆర్టీ, ఎస్.ఐ.ఇ.టి, ఇంటర్మీడియట్ బోర్డు, సాంఘిక, గిరిజన సంక్షేమ తదితర విద్యా సంస్థలు  ఆన్ లైన్ బోధనలు కొనసాగిస్తున్నాయన్నారు. సోమవారం నుండి నిపుణ ఛానల్ లో సాంఘిక గురుకుల సంక్షేమ శాఖ ఆరు నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠ్యాంశాలను లైవ్ ద్వార బోధించే ప్రక్రియ రెండవ విడత ప్రారంభమౌతుందని చెప్పారు.

 ఐఐటి, జేఈఈ విద్యార్థుల కోసం యుప్ టీవి సౌజన్యంతో ప్రతి రోజు 12గంటల ప్రసారాలుంటాయన్నారు. నిపుణ ఛానల్లో ఉదయం ఐదు గంటల నుండి 10 గంటల వరకు నీట్, సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మేయిన్ సబ్జెక్టులపై ప్రసారాలు, విద్య ఛానళ్లలో మరుసటి రోజు ఇవే సమయాల్లో పాఠ్యాంశాలు పునః ప్రసారం జరుగుతాయని శైలేష్ రెడ్డి వివరించారు. సుమారు 600 గంటల ప్రసారాలు పరీక్షలు జరిగే జులై 26వ తేదీ వరకు పూర్తికానున్నాయని, నూతన పద్దతిలో జరిగే బోధన ప్రసారాలను విద్యార్థులు వినియోగించుకునేలా వారి తల్లదండ్రులు అవగాహన కల్పించాలని కోరారు.

ఎక్స్ ఫ్లోరింగ్ ఇన్ఫినిటీ సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆరు నుండి  పదవ తరగతి విద్యార్థులకు స్పీడ్ మ్యాథ్స్ పై ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రసారం చేస్తామన్నారు. ఫాస్టెస్ట్ హ్యూమన్ కాల్యుకులేటర్ నీలకంఠ భానుప్రకాష్ చిన్న వయస్సులోనే గణిత బోధనలో అనేక రికార్డులు నెలకొల్పగా అతని  పాఠ్యాంశాల ఆధారంగా విద్యార్థులు మాథ్స్ నేర్చుకోవడానికి సులువైన పద్దతులు అలవడుతాయని సీఈవో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రూపొందించే 700 ఎపిసోడ్స్ 350 గంటల కంటెంట్ త్వరలో విద్యార్థులకు అందుబాటులో ఉండనుందన్నారు. ఇటీవల బి.బి.సి తో కుదిరన ఒప్పందం ప్రకారం ప్రతి రోజు 12 నుండి 12.30 అరగంట పాటు ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నామన్నారు.

ఈ ప్రసారాలు టీ-శాట్ నెట్వర్క్ సోషల్ మీడియా వేదిక Facebook/Twitter/Youtube:tsatnetwork, T-SAT APP, tsat.tv లలో అందుబాటులో ఉంటాయన్నారు.  

బదిరుల కోసం కరెంట్ అఫైర్స్:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభాలోని అన్ని వర్గాలకు కల్పిస్తున్న అవకాశాల్లో భాగంగా బదిరులకూ ప్రత్యేక వసతుతులు, సౌకర్యాలు కల్పిస్తుండగా  వారికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక కరెంట్ అఫైర్స్ కార్యక్రమాన్ని టీ-శాట్ రూపొందించి అరంగపాటు ప్రసారం చేయనుందని సీఈవో శైలేష్ రెడ్డి ప్రకటించారు. టీ-శాట్  ప్రసారం చేసే ప్రత్యేక కరెంట్ ఎఫైర్స్ ఎపిసోడ్స్ ను బదిరులు సద్వినియోగం చేసుకోవాలని సీఈవో సూచించారు.

More Press Releases