తాటి బెల్లం, తాటి - ఈత సిరప్ లను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

తెలంగాణ ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో తెలంగాణ పామ్ నీరా మరియు పామ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు వేద పామ్ ప్రొడక్ట్స్ వారు తయారు చేసిన తాటి బెల్లం, తాటి - ఈత సిరప్ లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ ని ప్రవేశపెట్టి గీత వృత్తిదారులకు ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు. రాష్ట్రంలో చేతి వృత్తులకు పూర్వవైభవం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా చేతి వృత్తిదారులకు అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

గీత వృత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ ని ప్రవేశపెట్టారన్నారు. నీరా పాలసీ వల్ల సాంప్రదాయకంగా తాటి, ఈత చెట్ల నుండి తీసిన నీరా ద్వారా సేంద్రియ ఉత్పత్తులైన తాటి బెల్లం, తాటి, ఈత సిరప్ లను తయారు చేసి ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఆయుర్వేద పద్దతిలో తయారు చేస్తున్నారన్నారు. ఈ నీరా బై ప్రొడక్ట్స్ ద్వారా మధుమేహం, మూత్రపిండాలలో వచ్చు రాళ్లు తొలగించడం తో పాటు మూత్ర సంబంధ వ్యాధులను నివారించేందుకు ఉపయోగపడుతుందన్నారు.

నీరా ఉత్పత్తుల వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. వీటితో పాటు మలబద్దకం, కాల్షియం, పొటాషియం తో పాటు ఐరన్, జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలను నివారిస్తుందన్నారు. వీటితో పాటు తాటి బెల్లం మరియు తాటి, ఈత సిరప్ లలో మిటమిన్ల, మినరల్స్ అధికంగా ఉంటాయన్నారు. నీరాలో మైగ్రేన్, బరువు తగ్గడం లోను, శరీరం లో నెలకొన్న వేడి తత్వాన్ని తొలగించటం లోను ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శాస్త్రవేత్తలు సైతం తమ పరిశోధనల్లో ఈ విషయాలను వెల్లడించారన్నారు. నీరా బై ప్రొడక్ట్స్ లను తయారు చేయటానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామన్నారు.

నీరా ఉత్పత్తులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ లో నీరా కేంద్రం ను ఆధునిక పద్దతిలో రూపొందించబోతున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ లో నిర్మిస్తున్న నీరా కేంద్రం ఏర్పాటు పనులకు టెండర్లు పూర్తి చేశామన్నారు. త్వరలోనేనీరా కేంద్రం పనులను పూర్తి చేసి దశల వారిగా జిల్లా కేంద్రాలకు విస్తరిస్తామన్నారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ , అంబాల నారాయణ గౌడ్, వింజమూరి సత్యం గౌడ్, భాను చందర్, శ్రీనివాస్, ధర్మరాజు, రామ్మోహన్ గౌడ్, ఈతముల్లు ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases