కరోనా బాధితులకు సహాయం ప్రకటించిన పెరిక కులసంఘం

Related image

  • మంత్రి కేటీఆర్ ను కలిసి సీఎం సహాయనిధి చెక్కు అందించిన కుల పెద్దలు
కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలంగాణ పెరిక కుల సంఘం (పురగిరి క్షత్రియ) పది లక్షల నూటా పదహారు రూపాయలను (10,00,116/-)  ప్రకటించింది. ఈరోజు (సోమవారం 08-06-2020)  రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావుని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం రాష్ట  పెరిక కుల సంఘం తరఫున చెక్ ను అందించారు.  

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర పెఱిక కుల సంఘం అధ్యక్షులు మద్దా లింగయ్య, ప్రధాన కార్యదర్శి లక్కరసు ప్రభాకర్ వర్మ, గౌరవ అధ్యక్షులు చుంచు ఊషన్న, అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు రామ్ దయానంద్ పాల్గొన్నారు.

కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి సీఎం సహాయనిధికి చెక్కు అందించిన పెరిక కుల పెద్దలను మంత్రి కేటీఆర్ అభినందించారు.

More Press Releases