సూర్యాపేట, నల్లగొండ మెడికల్ కాలేజీలపై మంత్రులు ఈటల రాజేందర్, జగదీష్ రెడ్డిల సమీక్ష

Related image

  • సూర్యాపేట, నల్లగొండ మెడికల్ కాలేజీలకు మరిన్ని మౌలిక వసతులు
  • నియామకాల పూర్తికి కసరత్తు
  • రెండో సంవత్సరం ప్రారంబానికి సర్వం సిద్ధం
  • నల్గొండ, సూర్యపేట మెడికల్ కళాశాలలపై హైదరాబాద్ లో మంత్రులు ఈటల రాజేందర్, జగదీష్ రెడ్డిల సమీక్ష
హైదరాబాద్: ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బి ఆర్ కే భవన్ లో సూర్యపేట, నల్గొండ మెడికల్ కళాశాలలపై వైద్యఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్, విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిలు సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగిడుతున్న నేపథ్యంలో వైద్య విద్యార్థులకు కావలసిన వసతులు, సిబ్బంది నియామకం, కళాశాలల నిర్మాణాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.

రెండు కళాశాలలో రెండో సంవత్సరం ప్రారంభమౌతున్నందున సిబ్బంది కొరత ను మంత్రుల దృష్టికి తీసుక రాగ పాలనా పరమైన అనుమతులు తీసుకొని త్వరితగతిన నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విదంగా ప్రభుత్వ ఆసుపత్రిలలో మార్చురీలు అదునికరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు ఈటల, జగదీష్ రెడ్డిలు సూచించారు.

ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్  మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి,టి యస్ యం యస్ ఐ డి సి, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సి ఇ లక్ష్మారెడ్డి లతో పాటు నల్గొండ,సూర్యపేట మెడికల్ కళాశాలలప్రిన్సిపాల్లు,సూపరెండేంట్ లు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases