కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం ప్రకటించిన అల్లం నారాయణ
హైదరాబాద్ లో మరో ముగ్గురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఆ ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున, మహబూబ్ నగర్ జిల్లాలో హోంక్వారైంటైన్ లో ఉన్న ఇద్దరు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 10 వేల చొప్పున, మొత్తం 80 వేల ఆర్థిక సహాయం నేడు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. ఆయా పాత్రికేయుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేశారు.
ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటీవ్ లు వచ్చిన డిల్లీ, జోగులాంబ గద్వాల్, హైదరాబాద్ లకు చెందిన 10 మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా కారణంగా క్వారంటైన్ లో ఉన్న11 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున, ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల 10 వేల రూపాయలను అకాడమీ నిధుల నుండి అందించామని తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని ఆయన వైద్యులను కోరారు.
ఇండ్ల నుండి బయటికి వెళ్లే సందర్భంలో జర్నలిస్టులు ప్రతి ఒక్కరు మాస్కు, సానిటైజర్ ను వాడాలని తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా వైరస్ పై అవగాహన కలిగించడంలో జర్నలిస్టులది కీలక పాత్ర అని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి జర్నలిస్టులకు అన్ని విధాలు అండగా ఉంటుందని ప్రకటనలో వెల్లడించారు.