'పరిశుభ్రత - పారిశుధ్య' కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలి: మంత్రి పువ్వాడ

Related image

ఖమ్మం: జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో నేడు జూన్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్న "పరిశుభ్రత - పారిశుధ్య" కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తొలుత ఖమ్మం కార్పొరేషన్ లోని 5, 11, 46వ డివిజన్లలో పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు.

పల్లె ప్రగతికి కొనసాగింపుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొనిజర్ల, కొండకోడిమ గ్రామంలో మంత్రి పువ్వాడ విస్తృతంగా పర్యటించారు. గ్రామాలను ఆకస్మిక తనిఖీలు చేస్తూ, పారిశుద్ధ్యం పరిశీలిస్తూ, తగు సూచనలు, ఆదేశాలు ఇస్తూ, పారిశుధ్యం అద్వనంగా ఉన్న చోట పలువురికి ఫైన్ వేశారు. పారిశుద్ధ్య నిర్వహణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలను తవ్వారు. మురికి కాలువల నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సర్పంచ్, గ్రామ కార్యదర్శి, సిబ్బందిని ఆదేశించారు.

కాలువలు శుభ్రంగా లేకపోతే, దోమలు, దుర్గంధం పెరిగి, అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించి,  గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. కరోనా వ్యాప్తి నివారణతో పాటు, రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి పువ్వాడ ఆదేశించారు. వైరస్ వ్యాప్తి నివారణ చర్యలో భాగంగా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, ధరించని వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని అధికారులకు, ఆయా గ్రామ సర్పంచులు సూచించారు. పల్లెల్లో, పట్టణాల్లో నేటి నుండి ప్రతి గ్రామంలో నిర్దేశించిన పనులను పూర్తి చేయాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన పనులను వివరించారు.
 
◆ ప్రతి గ్రామంలోని మురికి కాలువలను శుభ్రం చేసి మురుగు నీరు, వర్షపు నీటి ప్రవాహాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలలో నీరు ఇనికిపోయే విధిగా చర్యలు చేపట్టాలన్నారు. వర్షపు నీరు, వృధాగా పోయే నీరు నిలువకుండా గుంతలను మొరంతో నింపాలని సూచించారు. ప్రధాన రోడ్లు, గ్రామాల్లోని రోడ్ల గుంతలను పూడ్చాలి. రోడ్లపై ఎలాంటి నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు ప్రతి గ్రామంలో ఆచరించాలన్నారు.

◆  నీటి పైపు లైన్ల లీకేజీలుంటే గమనించి వాటిని సరిచేయించాలని, లీకేజీలతో నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు.

◆ ఓవర్ హెడ్ ట్యాంకులు, భూగర్భ నీటి ట్యాంకులు, సిమెంట్ ట్యాంకులు, మెటల్ డ్రమ్ములు, మట్టి గంగాళాలు, వాటర్ హార్వెస్టింగ్ ట్యాంకుల్లో దోమల లార్వాలను అంతం చేసేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

◆ అన్ని నివాసాల్లో ఫాగింగ్ చేపట్టాలని, దోమల లార్వాలను నశింపచేసే బైటెక్స్ స్ప్రే చేయించటంతో పాటు అవసరం మేరకు ఆయిల్ బాల్స్ ను నిరంతరంగా ప్రయోగిస్తూ ఉండాలన్నారు.

◆ ఖాళీ ప్రదేశాల్లో చెత్తను, పొదలను, పనికిరాని అటవీ సంబంధిత మొక్కలను తొలిగించి శుభ్రతను పర్యవేక్షించాలన్నారు.

◆ బస్టాండ్లు, మార్కెట్లు, స్కూళ్ళ పరిసరాలు, హాస్పటళ్ళ పరిసరాలు, రేషన్ షాపులు, బండ్ల స్టాండ్లలో 1 శాతం సోడియం హైపో క్లోరైడ్ ఫెనాలిక్ డిస్ ఇన్ఫెక్టెంట్ తో పిచికారి చేయించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్యే రాములు నాయక్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, అదనపు కలెక్టర్ స్నేహాలత, మార్కుఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ రాజశేఖర్, DPO శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ, తహసీల్దార్, అటవీ అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు ఉన్నారు.

More Press Releases