ఇతర రాష్ట్రాల రాకపోకలు కూడా ఎలాంటి నియంత్రణ అవసరం లేదు: సీఎం కేసీఆర్

Related image

హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించారు.

కంటైన్మేంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని నిర్ణయించారు. కంటైన్మంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి పూట కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు. షాపులను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని కోరారు. ఇతర రాష్ట్రాల రాకపోకలు కూడా ఎలాంటి నియంత్రణ అవసరం లేదని చెప్పారు.

More Press Releases