గొర్రెల సంపదలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణ!
- తెలంగాణ రాష్ట్ర గొర్రెల & మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ తేది:11/08/2014 న 1964 ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం కింద 1/2014 నంబరుతో రిజిస్టరు చేయబడింది.
- ఈ సమాఖ్య మూడుఅంచెల వ్యవస్థ తో పనిచేయును. గాుమ స్థాయిలో పాుధమిక గొఁరెల పెంపకముదారుల సహకార సంఘము, జిల్లా స్థాయిలో (11) జిల్లా సంఘాలు మరియు రాష్ట్ర స్థాయిలో ఆపేక్స్ బాడీ గా తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ పనిచేయును. పాుధమిక గొర్రెల పెంపకముదారుల సహకార సంఘము లను బలోపేతం చేయుట, సభ్యుల కు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పధకాల ద్వారా జీవనోపాధి కల్పించుట ఈ సమాఖ్య యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.
- రాష్ట్రం మొత్తం మీద 7,61,895 మంది సభ్యులు (8109) పాుధమిక గొఁరెల పెంపకముదారుల సహకార సంఘము లలో సభ్యులు గా నమోదు అయివున్నారు.
- రాష్ట్రములో సుమారుగా 6 నుండి 7 లక్షల కుటుంబాలు గొర్రెలు మరియు మేకల పెంపకముపై ఆధారపడి జీవించుచున్నారు.
- ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకము:
- 20వ పశుగణన లెక్కల ప్రకారము రాష్ట్రములో మొత్తము గొర్రెలు మరియు మేకల సంఖ్య 240.48 లక్షలు (గొర్రెల సంఖ్య 191.00 లక్షలు, మేకల సంఖ్య 49.48 లక్షలు). గొర్రెల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానములో వున్నది.
- గొర్రె ల పెంపకములో గొల్ల, కుర్మ మరియు యాదవ కులస్థులకు ఉన్నఅపార అనుభవము మరియు నైపుణ్యమును ఉపయోగించుకొని మాంసం ఉత్పత్తి లో స్వయం సమృద్ధి సాధించుటకు మరియు ఇతర రాష్ట్ర మరియు దేశాలకు మాంసం ఎగుమతి చేసే ఉద్దేశ్యంతో గౌరవ రాష్ట్ర ముఖ్య మంతిువర్యులు బృహత్తరమైన గొర్రెల అభివృద్ధి పదకమును ప్రవేశబెట్టినారు.
- ఇప్పటివరకూ రాష్ట్రంలో 3.66 లక్షల లబ్దిదారులకు రూ. 4579.67 కోట్ల (ప్రభుత్వ వాటా రూ.3434.75 కోట్లు మరియు లబ్దిదారుని వాటా రూ.1144.92 కోట్లు) ఖర్చు చేసి 76.94 లక్షల గొర్రెలను పొరుగు రాష్ట్రాల రైతులనుండి కొనుగోలు చేసి సరఫరా చేయడమైనది.పథక అమలు వలన కలిగిన ప్రయోజనాలు:
- పంపిణీ చేసిన గొర్రెల ద్వారా 108.37 లక్షల పిల్లలు పుట్టడం జరిగినది (అంచనా). దీని ద్వారా గ్రామాలలో రూ.4877.01 కోట్ల సంపద సృష్టించబడినది. వీటిద్వారా 75865.82 మెట్రిక్ టన్నుల మాంసవుత్పత్తి అంచనా వేయబడినది.
- 2019 లో జరిగిన 20వ జాతీయ పశుగణ లెక్కల ప్రకారము మన రాష్ట్రం గొర్రెల సంఖ్యలో (190.63 లక్షలు) దేశంలోనే మొదటిస్థానంలో వున్నది. ఇది 2012 లో జరిగిన 19వ జాతీయ పశుగణ లెక్కల తో పోలిస్తే (గొర్రెల సంఖ్య 128.35 లక్షలు) 48.52 శాతం ఎక్కువ.
- భారత ప్రభుత్వము వారి వివరాల ప్రకారం వధిచబడే గొర్రెల సంఖ్య 2017-18 లో 120.30 లక్షలు కాగా 2019-20 నాటికి 208.00 లక్షలుగా నమోదుచేయబడినది. అనగా 57.8 శాతం ఎక్కువ నమోదుచేయబడినది. ఇది గొర్రెల పథకము అమలు ద్వారా సాధ్య పడినది.
- పధక అమలుకు ముందు మరియు తరువాత మాంస ఉత్పత్తిలో గణనీయమైన మార్పు వచ్చింది. 2015-16లో గొర్రె మాంసఉత్పత్తి 1.35 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 2019-20లో గొర్రె మాంస ఉత్పత్తి 2.77 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేయబడినది. 2015-16 తో పోల్చితే యాటమాంస ఉత్పత్తిలో 105% పెరుగుదల రావడమైనది.
- యాట మాంసం యొక్క వినియోగం బాగా పెరిగినది. జాతీయ సగటు మాంస వినియోగము (అన్ని మాంసాలు కలిపి) 5.4 కేజీలు కాగా తెలంగాణలో సగటు మాంస వినియోగము 9.2 కేజీలు. దీనిలో యాట మాంసం వాటా 4 కేజీలు.