లాక్‌డౌన్ సమయంలో నగరంలో వేగంగా జరుగుతున్న ఎస్.ఆర్.డి.పి పనులు
- ఉప్పల్- ఎల్బీనగర్ మార్గంలో కామినేని వద్ద నిర్మించిన 2వ ఫ్లైఓవర్, ఎల్బీనగర్ జంక్షన్‌లో నిర్మించిన అండర్ పాస్‌ను ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, మూసి రివర్ ఫ్రంట్ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
- హాజరైన ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్
- సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తున్న కార్మికులు -ఎక్కువ యంత్రాలతో తక్కువ మంది కార్మికులను వినియోగిస్తున్న ఏజెన్సీలు
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...ఎస్.ఆర్.డి.పి ప్యాకేజి -2 కింద రూ. 448 కోట్ల వ్యయంతో చేపట్టిన 11 పనులలో ఇప్పటి వరకు రూ.268 కోట్ల విలువైన పనులు పూర్తి అయినట్లు తెలిపారు. అందులో ఐదు పనులను వినియోగంలోకి తెచ్చినట్లు వివరించారు. ఈ ప్యాకేజీలో భాగంగా చింతల్‌కుంట వద్ద అండర్‌పాస్, కామినేని వద్ద రెండు వైపులా ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్ జంక్షన్‌లో విజయవాడ వైపు వెళ్లే ఫ్లైఓవర్‌తో పాటు ఎల్బీనగర్ జంక్షన్‌లో అండర్‌పాస్‌లు పూర్తై ప్రారంభించడం జరిగింది. ఈ పనులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వాహనదారులు ఇక నుండి సిగ్నలింగ్ రహితంగా ప్రయాణించవచ్చు.