బాల్కొండ నియోజకవర్గంలో హిమాచల్ ఆపిల్ తోటని పరిశీలించిన మంత్రి వేముల

Related image

బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం వెంచిర్యాల్ లింబారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న హిమాచల్ ఆపిల్ తోటని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. యాపిల్ తోటను సందర్శించిన మంత్రి రైతును అభినందించారు. తెలంగాణ యాపిల్ గా ప్రసిద్ధి చెందుతున్న ఈ రకం యాపిల్ సాగు మంచి ఫలాలు ఇవ్వాలని కోరుకున్నారు. కేసీఆర్ సూచిస్తున్న లాభసాటి వ్యవసాయ విధానం అంటే ఇదేనని, ఈ రకంగా కొత్తసాగు లాభదాయకంగా ఉండే పంటలు వేసుకోవడమే అన్నారు. నా నియోజకవర్గంలో ఇలాంటి ప్రయోగాత్మక యాపిల్ తోట పెంచడం ఎంతో సంతోషాన్నిస్తోందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.

Vemula Prashanth Reddy

More Press Releases