రైతు రాజు కావాలన్న నినాదాన్ని నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే: మంత్రి ఎర్రబెల్లి
నియంత్రిత పద్ధతిలో ప్రాధాన్యం గల పంటలనే సాగు చేయాల్సిన అవసరం - రైతులు తమ పంటల ద్వారా మంచి దిగుబడులు పొంది, లబ్ధి పొందాల్సిన ఆవశ్యకతపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంటల ప్రణాళికను విడుదల చేసి - రైతులు వేయాల్సిన పంటలు-వాటి మార్కెటింగ్, డిమాండ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతు సమన్వయ సమితి బాధ్యులకు మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్, సభ్యులు, జిల్లా కలెక్టర్ అజీమ్, జిల్లాలోని వ్యవసాయశాఖ సహా, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్:
- వ్యవసాయం దండుగ కాదు... ఇక పండుగేనని సిఎం కెసిఆర్ నిరూపించారు
- ఇప్పుడు బాగా చదువుకున్న వారు కూడా తెలంగాణలో సాగు చేయాలనే చూస్తున్నారు
- రైతు రాజు కావాలని స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అంటున్నారు. కానీ ఆ నినాదాన్ని నిజం చేసిన ఘనత సీఎం కెసిఆర్ దే
- తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజు కావాలన్న నినాదాన్ని ఇక నుంచి ఒక విధానంగా అమలు చేద్దాం
- రైతాంగానికి సాగునీరు, ఉచిత విద్యుత్, పంటల పెట్టుబడులు, రుణ మాఫీలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధరలు, అవసరమైతే ఆ పంటలను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయడం వంటివెన్నో ఇప్పుడు తెలంగాణలో రైతులకు అందుబాటులోకి తెచ్చిన సీఎం కెసిఆర్
- రైతు బంధుకి 14వేల కోట్లు రైతు రుణమాఫీకి 25వేల కోట్లు, ఉచిత కరెంటుకి 10వేల కోట్లు, రైతుల కోసం ప్రభుత్వం మొత్తం 60వేల కోట్లను ఖర్చు చేస్తున్నది
- మూస,పాత పద్ధతుల్లో కాకుండా, సంప్రదాయ పంటలకు వెళ్ళకుండా, ఆధునిక పద్ధతుల్లో ఆలోచిద్దాం
- లాభసాటి పంటలతో, అంతర్జాతీయ మార్కెట్ లో కూడా డిమాండ్ ఉన్న దిగుబడులతో రైతు బాగు పడాలన్నదే సీఎం కెసిఆర్ లక్ష్యం. అందుకే ప్రాధాన్య పంటలను వేయాలని చెబుతున్నారు
- సన్న, పొడవు రకాల వరి ధాన్యం, పత్తి, కంది పంటలకు ప్రపంచ వ్యాప్తంగా బాగా డిమాండ్ ఉన్నది
- రాష్ట్రంలో కోటి 23 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, కంది వంటి పంటల సాగు ఈ వానాకాలం జరగాలని సిఎం లక్ష్యంగా నిర్ణయించారు
- గతంకంటే వరి పదిన్నర లక్షల ఎకరాలు, పత్తి 65లక్షల ఎకరాలు పెరిగే అవకాశం ఉంది. 76.83శాతం కంది పంట పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు
- అంతా ఒకే రకమైన పంటలు వేయడం వల్లే డిమాండ్ తగ్గి, కనీస మద్దతు ధర రావడం లేదు
- మన భూములు, భూ సారాన్ని బట్టి, మార్కెట్ లో డిమాండ్ ని బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పిన విధంగానే పంటలు వేయాలని సిఎం కెసిఆర్ రైతాంగానికి చెబుతున్నారు
- తెలంగాణ సోనా వంటి సన్న బియ్యం రకాలు, లాంగ్ స్టేపుల్ కాటన్ ని మాత్రమే వేయాలి
- వానా కాలం మక్కల దిగుబడి తక్కువ ఉండటమే గాక, బూజు పట్టే అవకాశం ఉంది
- పైగా మక్కల నిలువలున్నాయి. వచ్చే పంటల నాటికి మక్కలకు డిమాండ్ ఉండదని ముందే గుర్తించారు
- ఈ వానాకాలం నుంచి వరిని 60శాతం సన్న రకాలు, 40శాతం దొడ్డు రకాలు వేస్తే బాగుంటుంది
- భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాలు, 223 గ్రామాల్లో 241 గ్రామ పంచాయతీల్లో ఏయే పంటలు వేయాలో వ్యవసాయ అధికారులు ఇప్పటికే నివేదికలుసిద్ధం చేశారు
- ఎఇఓ లు రైతులను కలిసి వారు వేయాల్సిన పంటలను ముందే చెబుతారు
- జిల్లాలో 2.27లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. ఈ వానా కాలం 2.40 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా
- జిల్లాలో గతంలో 1.29లక్షల ఎకరాల్లో వేయగా, ఈ సారి1.42లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుంది
- జిల్లాలో వరి గతంలో 94వేల ఎకరాల్లో సాగవగా, ఈ సారి దాదాపుగా అంతే సాగవుతుందని అంచనా
- గత ఏడాది కంది కేవల 278 ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి 2వేల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉంది
- గతంలో 2వేల ఎకరాల్లో మక్కజొన్న వేశారు. ఈ సారి మక్కజొన్నకు బదులు పత్తి లేదా కందులు వేయాలని ప్రభుత్వం సూచిస్తున్నది
- రైతులు ముఖ్యమంత్రిగారు, సైంటిస్టులు సూచిస్తున్న తెలంగాణ సోనా, హెచ్ ఎం టి సోనా మరికొన్ని రకాల పంటలే వేయాలి
- ముత్తారం మహాదేవ్ పూర్ మండలం ములుగుపల్లి లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను పెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే 200 ఎకరాల భూమిని కూడా గుర్తించడం జరిగింది
- ములుగు ఘన్ పూర్ మండలం మైలారం గ్రామంలో 20 ఎకరాల్లో వ్యవసాయ గోదాములు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం
- తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే సాగు విస్తీర్ణం బాగా పెరిగింది
- పత్తి గత ఏడాది 52.56 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే, ఈ సారి 65లక్షల ఎకరాల్లో సాగు అవనుంది
- వరి గత ఏడాది 40.30లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 41.76లక్షల ఎకరాల్లో సాగు కానుంది
- కంది గత ఏడాది 7.29లక్షల ఎకరాల్లో సాగు అవగా, ఈ ఏడాది 12.51లక్షల ఎకరాల్లో సాగు కానన్నది
- సిఎం కెసిఆర్ కేవలం రైతుల సంక్షేమం కోసం మాత్రమే ప్రాధాన్య పంటలు వేయమంటున్నారు
- కెసిఆర్ చెప్పినట్లుగా పంటలు వేసి, మంచి లాభాలు గడించి, రైతులు ఎదగాలన్నదే కెసిఆర్ లక్ష్యం
- ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులను చైతన్య పరచాలి. అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
- రైతులకు ఎఇఓలు, వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలి. రైతులను గైడ్ చేస్తుండాలి
- నిర్దేశిత పంటలు, నిర్దేశిత లక్ష్యాలకనుగుణంగా సాగయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులది. అలాగే రైతులను అందుకు సమాయత్తం చేసే బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలి
- కరోనా, లాక్ డౌన్ సమయాల్లోలాగే ప్రజలు, రైతులు ప్రభుత్వానికి సహకరించాలి
- ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కెసిఆర్, అన్ని రంగాల్లో విజయవంతంగా సాగుతున్నది
- సాగుబడిలోనూ ఆ విజయపరంపరని కొనసాగించాలి
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండల పరిషత్ కార్యాలయంలో వానాకాలం నియంత్రిత వ్యవసాయసాగు విధానం వ్యవసాయం పై అవగాహన కార్యక్రమానికి హాజరైన కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, జిల్లాపరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్లు. పాల్గొన్న మార్కెట్ కమిట్ చైర్మన్ సునీత లక్ష్మి, గ్రంధాలయం సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్ ,డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మదుకర్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు నందారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ ఎల్లుబాయ్, జడ్పీటీసీ అనిత, ఎంపీటీసీలు,సర్పంచులు, వ్యవసాయ అనుబంధ సంస్ధల సంఘాల ప్రతినిధులు వ్యవసాయ అధికారులు.