మాస్క్ కేంద్రాలను ఏర్పాటు చేసిన మంత్రి పువ్వాడ

Related image

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, ఆర్టీసీ బస్ స్టాండ్, గాంధీ చౌక్ సెంటర్ లలో మాస్క్(KIOSK) కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయా కేంద్రాలను ప్రారంభించారు. ప్రజల తాకిడి ఎక్కువ ఉన్న చోట అందరికి మాస్కులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అతి తక్కువ ధరకు 10 రూపాయిలకే కాటన్ మాస్క్ లు అందుబాటులో ఉంచామన్నారు. మంత్రి వెంట మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి IAS, అసిస్టెంట్ కలెక్టర్ ఆదర్శ్ సురభి IAS, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Puvvada Ajay Kumar

More Press Releases