ఎనుమాముల మార్కెట్ యార్డ్ ను పునః ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
లాక్ డౌన్ నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా ఎనుమాముల మార్కెట్ యార్డ్ లో నిలిచిపోయిన క్రయ విక్రయాలను 65 రోజుల తర్వాత తిరిగి బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పునః ప్రారంభించారు. యార్డులో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని మంత్రి స్ప్రే చేయించారు. యార్డుల్లో కలియ తిరిగి, రైతులతో మాట్లాడి, వారి పంటలు పరిశీలించి, గిట్టుబాటు ధర, కరోనా ఎఫెక్టుతో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. అలాగే, రైతులకు మాస్కులు, స్థానిక విలేకరులకు సానిటైజర్లు పంపిణీ చేశారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:
- వరంగల్ దేశంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి
- ఇక్కడ ధాన్యం, పత్తి, మిర్చి వంటి పంటలను భారీ ఎత్తున రైతులు తెస్తున్నారు
- రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించే మంచి మార్కెట్
- కరోనా లాక్ డౌన్ వల్ల ఏర్పడిన ప్రతిష్టంభనను కాదని, రైతుల కోసం మార్కెట్ ని తిరిగి ప్రారంభించాం
- సిఎం కెసిఆర్ గారు ప్రత్యేక చొరవతో ఎనుమాముల మార్కెట్ మొదలైంది
- రైతులు తమ పంటలను తక్కువ ధరలకు అమ్ముకోవద్దు
- రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ సౌకర్యంతోపాటు. పంటలో 75శాతం రుణం లభిస్తుంది
- మేలు రకం మిర్చికి సరైన ధర రాలేదని రైతులు భావిస్తే, కోల్డ్ స్టోరేజ్ కో పెట్టుకుంటే మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే, పంట విలువలో వడ్డీ లేకుండా 75శాతం అప్పుగా తీసుకునే అవకాశం ఉంది
- పసుపు మార్కెట్ ని కూడా ప్రారంభించాలని రైతుల నుంచి డిమాండ్ ఉన్నది
- కానీ, పసుపు మార్కెట్ వ్యవస్థ కేంద్రం చేతుల్లో ఉంది. కేంద్రం చేతులెత్తేయడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. అయినా సరే, పసుపు కొనుగోలుపై సిఎం గారితో మాట్లాడి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాం
- రైతులు కూడా అన్ని రకాల పంటలు ఇక్కడకు తేవచ్చు\
- వ్యాపారులు కేవలం లాభాపేక్షే కాకుండా, కాస్తో, కూస్తో సేవా దృక్ఫథంతో వ్యవహరించాలి
- వ్యాపారులు రైతులకు అన్యాయం జరగకుండా కొనుగోలు చేయాలి
- రైతులు ఎంతో కష్ట పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడాలి
- మార్కెట్ చైర్మెన్, జిల్లా కలెక్టర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మెన్ లు కలిసి రోజువారీగా సమీక్షించి, రైతు పండించిన పంటకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశిస్తున్నా
- ప్రభుత్వ నిర్దేశించిన పంటలు వేస్తే రైతుకు ఎవరో న్యాయం చేయాల్సిన పని లేదు
- ప్రభుత్వం నిర్ణయించిన పంటలు వేస్తే రైతులు లాభాల బాట పడతారు
- దేశంలో, ప్రపంచంలో మంచి డిమాండ్, మార్కెట్ ఉన్న పంటలనే పండించాలి
- వరి సన్న రకాలు వేయాలి. తెలంగాణ సోనా షుగర్ లెస్ పంట. మంచి డిమాండ్ ఉన్నది
- తెలంగాణ సోనా తింటే షుగర్ సమస్యలు తలెత్తవు. మన సైంటిస్టులే కనుక్కున్నారు
- ప్రజలంతా ఈ రకమైన బియ్యం కావాలని కోరుకుంటున్నారు
- మన దగ్గర పండే పత్తి పంటకు బయట బాగా డిమాండ్ ఉన్నది
- కూరగాయలు, పూలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెప్పించుకుంటున్నాం. ఈ రకమైన పంటలు కూడా రైతులు వేయాలి
- ఉమ్మడి జిల్లాలో మహబూబాబాద్, వరంగల్ అర్బన్, జనగాం లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సెజ్ లను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మంజూరు చేశారు
- ఒక్కో సెజ్ కి కనీసం వెయ్యి ఎకరాల భూమి అవసరం. ఆ భూ సేకరణ చర్యలు చేపట్టాం