వరంగల్ పోలీస్ కమీషనర్ ను అభినందించిన హోం మంత్రి మహమూద్ అలీ
సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లాలో జరిగిన సంఘటనను కొన్ని గంటలలోనే ఛేదించిన వరంగల్ పోలీస్ సిబ్బందిని, కమిషనర్ వి.రవీందర్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సోమవారం నాడు అభినందించారు. వరంగల్ జిల్లాలోని గొర్రెకుంట గ్రామ పరిధిలోని బావిలో రెండు రోజుల వ్యవధిలో తొమ్మిది మృతదేహాలు వెలుగులోకి రావడం విదితమే. అంతుచిక్కని శవాల విషయంలో పకడ్బందీగా దర్యాప్తు జరపాలని హోంమంత్రి గతంలో కమీషనర్ కు సూచించారు. మిస్టరీని ఛేదించేందుకు వరంగల్ పోలీసులు తీవ్రంగా కృషి చేసి నిందితుడిని పట్టుకోవడంతో కమీషనరును ,దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని హోంమంత్రి ప్రశంసించారు. అదేవిధంగా, గతంలో తొమ్మిది నెలల పాప హత్య సంఘటనలోనూ 48 రోజులలో చార్జిషీట్ వేసి నిందితుడికి శిక్ష పడేటట్లు చేసిన వరంగల్ పోలీసుల కృషిని ఈ సందర్భంగా హోంమంత్రి గుర్తుచేశారు.