వలస కార్మికులకు ఆపన్నహస్తం అందించిన వీర్ ఫౌండేషన్

Related image

  • 16వేలకు పైగా హౌసింగ్ సొసైటీలు, హాస్పిటల్స్,ప్రజారవాణా వాహనాలు, ఆఫీసులకు పూర్తి ఉచితంగా శానిటైజేషన్ సేవలు
  • వలస కార్మికులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు భోజన సౌకర్యాలు
హైదరాబాద్, మే 25, 2020: కోవిడ్-19 కారణంగా విధించిన లాక్‌డౌన్ వేళ వీర్ ఫౌండేషన్ సంస్థ భారీ స్థాయిలో శానిటైజేషన్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించడంతో పాటుగా వలస కార్మికులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు భోజన సౌకర్యాలను సైతం కల్పించింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ శానిటైజేషన్ కార్యక్రమాలలో భాగంగా 16వేల హౌసింగ్ సొసైటీలు, హాస్పిటల్స్, ఆఫీసులు, ప్రజా రవాణా వాహనాలను పూర్తి ఉచితంగా శానిటైజ్ చేశారు.

వీర్ ఫౌండేషన్ ప్రయత్నాలను గురించి నితిన్ సంఘవి, ట్రస్టీ మాట్లాడుతూ " భారతదేశ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి అడ్డుకోవడానికి మేము మా వంతు ప్రయత్నాలను చేశాం. మా సహచర ట్రస్టీలు, వలెంటీర్లు గత రెండు నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తూ శానిటైజేషన్ కార్యక్రమాలను చేస్తూనే తగిన రీతిలో భోజన ఏర్పాట్లనూ చేశారు. మరీముఖ్యంగా వలసకార్మికులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం మేము ఉచితంగా భోజన సౌకర్యాలను కల్పించాం. ఇవే తరహా కార్యక్రమాలను మరింతగా విస్తరించనున్నాం'' అని అన్నారు.

More Press Releases