నిరుపేదలకు మెరుగైన వైద్యానికే బస్తీ దవాఖానాలు: తెలంగాణ ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్
పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లోనే వివిధ హంగులతో, వైద్య కేంద్రాలను నెలకొల్పే పద్దతి వల్ల భవిష్యత్తు లో వైద్య సేవలు పెరుగుతాయి. వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారుతున్న దశలో బస్తీ దవాఖానాల ఏర్పాటు వల్ల పేదలకు ప్రయోజనం కలుగుతుంది. జంటనగరాల్లో వివిధ ప్రాంతాల్లో కొత్త బస్తీ దవాఖానల ప్రారంభోత్సవంలో భాగంగా శుక్రవారం స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి భోజగుట్ట, ఆసిఫ్ నగర్ (దత్తాత్రేయ నగర్), గగన్ మహల్ (దోమలగూడ), లంబాడి బస్తీ (తార్నాక) ప్రాంతాల్లో నాలుగు బస్తీ దవాఖనాలను పద్మారావు గౌడ్ లాంచనంగా ప్రారంభించారు.
దోమలగూడాలో స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాల్, భోజగుట్టలో స్థానిక శాసన సభ్యులు జాఫర్ హుస్సేన్, ఆసిఫ్ నగర్ లో స్థానిక CORPORATOR మహమ్మద్ యూసుఫ్, రాష్ట్ర వైద్య శాఖా అదనపు డైరెక్టర్ డాక్టర్ నాయక్, తెరాస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం GHMC పరిధిలో 123 బస్తీ దవాఖనాలు ఉన్నాయి. వాటి ద్వారా రొజూ 10 వేల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. కొత్తగా శుక్రవారం 45 బస్తీ దవాఖానలు ప్రారంభం. వాటి ద్వారా మరో 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి. ప్రతి బస్తీ దావాఖానలో ఓ నిపుణుడైన వైద్యుడు, ఓ నర్సు, ఓ సహాయకుడు ఉంటారు.
హైదరాబాద్ లో 22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లలో 15, రంగారెడ్డి లో 05, సంగారెడ్డి లో ౦౩ బస్తీ దవాఖనాలు ప్రారంభిస్తున్నాము. సికింద్రాబాద్ పరిధిలో ఇప్పటికే రవీంద్రనగర్, చింత బావి ప్రాంతాల్లో ఇప్పటికే రెండు బస్తీ దవాఖనాలు నెలకొల్పాము. త్వరలో ఆర్య నగర్, అంబర్ నగర్, వినోభా నగర్ ప్రాంతాల్లకుడా వీటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు.
లంబాడి బస్తీ సమస్యలపై సత్వర స్పందన:
లంబాడి బస్తీలో GHMC జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఉప కమీషనర్ రవి కుమార్ లతో పాటు స్థానిక నేతలతో కలిసి బస్తీ దావాఖనాను ప్రారంభించారు. పలుఫురు స్థానికులు మంచీ నీటి సమస్యను నివేదించగా వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారి చేశారు. అదే విధంగా తమకు తగిన ఆహారం, సరకులు లభించడం లేదని పలుఫురు ఫిర్యాదు చేయగా వారికీ తమ సొంత నిధులతో నిత్యావసర సరకులను అందించేందుకు పద్మారావు గౌడ్ ఏర్పాట్లు జరిపారు.