వలస కార్మికులకు కల్పించిన వివిధ సౌకర్యాల గురించి కేంద్రమంత్రికి వివరించిన తెలంగాణ మంత్రి

Related image

కరోనా విపత్కర పరిస్థితుల్లో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహార శాఖా మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అన్ని రాష్ట్రాల పౌర సరఫరాల శాఖమంత్రులతో దృశ్య శ్రవణ కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో వలస కార్మికులకు కల్పించిన వివిధ సౌకర్యాల గురించి కేంద్రమంత్రికి వివరించారు.
 
తెలంగాణ రాష్ట్రంలో ఫీల్డ్ లెవెల్లో సర్వే నిర్వహించి 6.47 లక్షల వలస కార్మికులను గుర్తించి వివరాలు సేకరించడం జరిగినది.  వలస కార్మికులకు 7608.012 మెట్రిక్ టన్నుల బియ్యం మరియు రూ. 31.61 లక్షల నగదును వారికి పంపిణీ చేయడం జరిగినది. వలస కార్మికులకు కల్పించిన వివిద సౌకర్యాలు  మరియు యాసంగీ ధాన్యం కొనుగోలు గురించి వివరించారు.

One Nation – One Ration (Intrastate Portability / National Portability) కార్యక్రమంలో బాగంగా తెలంగాణలో ఇప్పటి వరకు 96.40% లబ్దిదారుల యొక్క ఆధార కార్డులను రేషన్ కార్డుకు అనుసంధానం చేయడం జరిగినది. ఈ One Nation – One Ration కార్యక్రమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానంలో వుంది.

రూ. 500/- లను వలస కార్మికుల పంపిణీ చేసిన నగదును రూ. 2,000/- లకు పెంచాలని మరియు ఏప్రిల్ నెలలో ఇచ్చిన బియ్యాన్ని మే మరియు జూన్ నెలలో కూడా ఇవ్వాలని ఈ సందర్బంగా కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

More Press Releases