ఏ ఒక్క వలస కార్మికుడు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి రావొద్దు: సీఎం కేసీఆర్

Related image

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ ఒక్క వలస కార్మికుడు కాలినడకన తన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిన దుస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను అదేశించారు. వలస కార్మికులు తమ సొంత ప్రాంతానికి పోయేలా అవసరమైన రైళ్లు సమకూర్చాలని సీఎస్ ను ఆదేశించారు. రైళ్లు లేని ప్రాంతాల నుంచి అవసరమైతే బస్సుల ద్వారా కార్మికులను తరలించాలని సీఎం సూచించారు. సొంత ప్రాంతాలకు వెళ్లాలని కోరుకునే వలస కార్మికులెవరు నడిచి పోవాలనే ఆలోచన చేయవద్దని, తెలంగాణ ప్రభుత్వం వారి తరలింపుకై పూర్తి బాధ్యత తీసుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

KCR
Telangana
Corona Virus

More Press Releases