రక్తం దానం ప్రాణదానంతో సమానం: తెలంగాణ మంత్రి పువ్వాడ

Related image

ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో అవసరానికి మించిన మోతాదులో రక్తం నిల్వ ఉంటుందని ఇలా నిల్వ ఉన్న అదనపు రక్తాన్ని అపదలో ఉన్న ఇతరులకు రక్తం దానం చేస్తే ప్రాణదానంతో సమానమని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తలసేమియా వ్యాధి సోకిన వారికి రక్తం ఎక్కించడం తప్పనిసరి కాబట్టి ఇలాంటి వారి కోసం సహాయం చేయడానికి కొన్ని సంస్థలు పని చేస్తున్నాయని మానవతాదృష్టితో వీరికి ఉచితంగా రక్తం అందిస్తున్న వారందరికి మంత్రి పువ్వాడ అజయ్ ధన్యవాదాలు తెలిపారు.

తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవడానికి బొమ్మ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్నిరవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అనతరం కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యా సంస్ధలను మూసివేసిన సందర్భంగా బొమ్మ విద్య సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులకు సమకూర్చిన నిత్యావసర సరుకులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదగా పంపిణీ చేశారు.

Puvvada Ajay Kumar

More Press Releases