తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ - సివిల్ సర్వీసెస్ శిక్షణకై ఎంపికైన అభ్యర్థుల వివరాలు ప్రకటన
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ హైదరాబాద్ కేంద్రంగా సివిల్ సర్వీసెస్ శిక్షణకై నిర్వహించిన ఎంపిక పరీక్ష మెయిన్స్ పరీక్ష ఫలితాల ఆధారంగా, ఇంటర్వ్యూ కి ఎంపికయిన అభ్యర్థుల వివరాలు వెలువరించినట్లు రాష్ట్ర స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ చౌడారపు తెలియజేశారు.
రెండు వందల ఫ్రెష్ అభ్యర్థుల అడ్మిషన్ లకు ఇంటర్వ్యూ నిమిత్తం నాలుగు వందల మందిని ఒకటికి రెండు నిష్పత్తి చొప్పున ఎంపిక చేసినట్లు, గత సంవత్సరం శిక్షణ పొందిన రిపీటర్స్ ను యాభై సీట్లకు గాను డైబ్భైఐదు మందిని ఎంపిక చేసినట్లు, అట్టి అభ్యర్థుల వివరాలు స్టడీ సర్కిల్ వెబ్ సైట్ (http://tsscstudycircle.telangana.gov.in/) నందు పొందుపరిచడంతో పాటు హైదరాబాద్ ప్రధాన స్టడీ సర్కిల్ మరియు వివిధ జిల్లాలలోని యస్.సి. స్టడీ సర్కిల్ కేంద్రాల యందు నోటీస్ బోర్డ్ పై అతికించడం జరిగిందని తెలియజేశారు.
ఈ అభ్యర్థులకు ఈనెల 26, 27 మరియు 30 వ తేదీలలో హైదరాబాద్ ప్రధాన స్టడీ సర్కిల్ నందు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని, ఏఏ విద్యార్థులకు ఏఏ తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహించబడుతుందనే వివరాలను కూడా స్టడీ సర్కిల్ ప్రధాన హైదరాబాద్ కేంద్రంతో పాటు జిల్లా కేంద్రాల వద్దకూడా అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. అలాగే ఇంటర్వూకుఎంపికయిన అభ్యర్థులకు ఫోను ద్వారా, యస్.యమ్.యస్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా సమాచారాన్ని అందిస్తున్నామని తెలియజేశారు.
ఇంటర్వ్యూ మూడు బోర్డుల ద్వారా రెండు విడుతలుగా ఉదయం పూట 75 మందికి, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు 90 మందికి మొత్తం రోజుకు 150 కి పైగా నిర్వహించడం జరగుతుందిని, ఆయా వివరాలన్నీ కూడా వెబ్సైట్ లో పొందుపరచడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రిలిమినరీ, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ లలో మూడింటినీ కలిపి మెరిట్ మార్కులు సాధించిన రెండు వందల మంది నూతన అభ్యర్థులను, యాభై మంది రిపీటర్స్ ను పదినెలల శిక్షణ కు ఎంపిక చేస్తామని అందులో ప్రభుత్వ ఆమోదితమైన రిజర్వేషన్లు పాటిస్తామని తెలియజేశారు.
హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెంబరు పద్నాలుగులో గల స్టడీసర్కిల్ కు ఉదయం ఇంటర్వ్యూ కలిగిన అభ్యర్థులు ఉదయం గం.9.30 కల్లా రిపోర్టు చేయాలనీ, మధ్యాహ్నం ఇంటర్వ్యూ కలిగిన అభ్యర్థులు మధ్యాహ్నం గం1.30 కల్లా రిపోర్టు చేయాలనీ తెలిపారు.