మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్

Related image

ఈ రోజు హైదరాబాద్ సెక్రటేరియట్, డి బ్లాక్ లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు ఆగ్రోస్ సంస్థ ద్వారా కస్టమ్ హైరింగ్ సెంటర్లు SERP ద్వారా 33 జిల్లాలో నెలకొల్పడానికి తెలంగాణ రైతాంగానికి నూతన వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అద్దె ప్రాతిపదికన అందించడానికి, స్వచ్ఛ తెలంగాణ మిషన్ క్రింద గ్రామీణాభివృద్ధి శాఖకు పరికరాలు అందించడానికి పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారిని కలిసి వినతిపత్రం ఇస్తూ కోరడం జరిగింది. రైతులకు కస్టమ్ హైరింగ్ తో పాటు అవగాహన కార్యక్రమాలు, నాణ్యమైన యంత్రాలు, పరికరాలు అందించే అవకాశం తెలంగాణ ఆగ్రోస్ కు ఎక్కువగా ఉంటుంది.

Errabelli
TRS
Hyderabad
Telangana
TSAGROs

More Press Releases