ప్రకాశం జిల్లా ట్రాక్టర్ ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

Related image

  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన బిశ్వ భూషణ్
విజయవాడ, మే 14: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో కూలీలు దుర్మరణం పాలైన సంఘటనపై ఆంధ్రపద్రేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభానికి ట్రాక్టర్ ఢీ కొన్న నేపధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా, పలువురు మహిళలు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వా భూషణ్ హరిచందన్ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు వేగంగా అందాలని ఆకాంక్షించారు.

Biswabhusan Harichandan
Andhra Pradesh

More Press Releases