ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసిన మంత్రి ఎర్రబెల్లి
- సాకారమైన దశాబ్దాల ప్రజల కల
- దేవాదుల ప్యాకేజీ-46 దక్షిణ ప్రధాన కాలువ ద్వారా జల కళ
- మూడు నియోజకవర్గాల్లో 33 గ్రామాల్లో సాగునీటి గలగల
- 91,700 ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం
- జై తెలంగాణ నినాదాలతో మిన్నంటిన ధర్మసాగర్ రిజర్వాయర్
- నీటి పంపు పంపింగ్ మొదలవడంతో... ఉబికిన నీరు, ఉప్పొంగిన నేతలు, ప్రజల గుండెలు
- నీటి తల్లి గంగమ్మకు పూలు, పసుపు, కుంకుమలతో నీరాజనాలు పలికిన మంత్రి ఎర్రబెల్లి, ఇతర ప్రజాప్రతినిధులు
- సీఎం కేసీఆర్ ఆశీస్సులు, సంకల్పంతో ఆవిష్కారమవుతున్న ప్రజల సాగునీటి కలలు
- తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం
- రైతాంగం కళ్ళల్లో ఆనందోత్సాహాలు వెల్లి విరియాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
- జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
91,700 ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం కానున్నది. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాలువల ద్వారా సాగునీటిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అనేక మంది ప్రజలు, సాగునీటి శాఖ అధికారుల సమక్షంలో గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. పూలు, పసుపు కుంకుమలతో నీరాజనాలు పలికారు. నీటి పంపు పంపింగ్ ప్రారంభించగానే, ఒక్కసారిగా... అక్కడున్న నేతలు, ప్రజల గుండెలు ఉప్పొంగాయి. కాలువల ద్వారా సాగునీటిని చూడటంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు, నేతలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. నీటి విడుదల సమయంలో జై తెలంగాణ నినాదాలతో ధర్మసాగర్ రిజర్వాయర్ మిన్నంటింది.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, దేవాదుల ప్యాకేజీ-46 దక్షిణ ప్రధాన కాలువ 78.20కోట్ల వ్యయంతో, 16.90 కి.మీ. ప్రధాన కాలువ పొడవుతో నిర్మితమైన ఈ దక్షిణ కాలువ ద్వారా మూడు నియోజకవర్గాల్లోని 8 మండలాలు, 33 గ్రామాలకు 91,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతాయని తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని 11 గ్రామాలలో 40,178 ఎకరాలు, వర్దన్నపేట నియోజకవర్గంలోని 11గ్రామాలలో 36,911 ఎకరాలకు, పరకాల నియోజవర్గంలోని 7 గ్రామాలలో 14,611 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి వివరించారు.
ఉద్యమం ద్వారా సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించారు.. సాధించిన తెలంగాణను సాగునీటి ద్వారా సస్య శ్యామలం చేస్తున్నారని మంత్రి అన్నారు. సీఎం మెండి మనిషి, మాట తప్పడు, మడమ తిప్పడు అన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తదన్న వాళ్ళందరికీ సాగునీటితో, అభివృద్ధితో, సంక్షేమంతో తగిన సమాధానం చెప్పారన్నారు. తెలంగాణ వచ్చాకే, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావస్తున్నది. దేవాదుల, ఎస్సారెస్పీ కాలువల నీరు అందివస్తున్నది. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పని చేస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ కోటి ఎకరాల సస్యశ్యామల మాగాణ అవుతుందని మంత్రి ఎర్రబెల్లి కరతళా ధ్వనుల మధ్య అన్నారు.
ఇప్పటికే దేశంలో ధాన్యం దిగుబడుల్లో తెలంగాణ నెంబవర్ వన్ స్థానానికి చేరిందన్నారు. రాష్ట్రంలో గత సీజన్ లో 40 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం పండిందన్నారు. 20 లక్షల ఎకరాల్లో మక్క, జొన్న, ఇతర పంటలు పండాయన్నారు. మరో 40 లక్షల ఎకరాలకు పంటలు పండే నీటిని అందిస్తే కేసీఆర్ కల, ప్రజల కల సాకారమవుతుందని, తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని, దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతు ఎదుగుతారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
సుభిక్ష తెలంగాణ ఉండాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు. రైతాంగం కళ్ళల్లో ఆనందోత్సాహాలు వెల్లి విరియాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అందుకే అన్నదాతలకు సాగునీరు, 24గంటల విద్యుత్, పంటల పెట్టుబడులు, రుణాల మాఫీ, రైతు బీమా ఇస్తూ, ఇప్పుడు పంటల కొనుగోలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. సీఎం కేసీఆర్ ని అన్నదాతలు, వయోవృద్ధులు,వికలాంగులు.. ప్రజలంతా రెండు చేతులతో దీవిస్తున్నారు. చెన్నారం, బొల్లికుంటలే కాదు...తెలంగాణ యావత్తు, కేసీఆర్ కి చేతులెత్తి మొక్కుతున్నారు. ఆయన కలకాలం చల్లగా ఉండాలి. ఆయనకు తెలంగాణ, తెలంగాణ ప్రజలు, నా తరుపున కృతజ్ఞతలు. ధన్యవాదాలు తెలుపుతున్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్ తదితరులు మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అనేక మంది ప్రజలు, సాగునీటి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో మల్లికాంబ మనోవికాస కేంద్రానికి నిత్యావసర సరుకులు:హన్మకొండ, మే 14: మల్లికాంబ మనోవికాస సేవలు అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మానసిక దివ్యాంగులకు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, మానవీయతతో కూడినవని అన్నారు. తమ ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను మంత్రి మనోవికాస కేంద్రానికి అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో పని చేస్తున్న వాళ్ళ సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నదన్నారు. పిల్లలు, వృద్ధులు, మానసిక, ఇతర దివ్యాంగులకు సేవలు చేయడం గొప్ప విషయమన్నారు. అలాంటి సేవ చేస్తున్న సంస్థని మంత్రి అభినందించారు. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నామని, ఇంకా అనేక మంది దాతలు తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదలకు, దివ్యాంగులకు అందించి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సంస్థలోని మానసిక దివ్యాంగులు పాల్గొన్నారు.
ప్రమాదానికి గురైన కళ్యాణలక్ష్మీ షాపింగ్ మాల్ ని పరిశీలించిన మంత్రి:
అగ్ని ప్రమాదానికి గురైన కళ్యాణలక్ష్మీ షాపింగ్ మాల్ ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎంత మేరకు నష్టం వాటిల్లిందని అడిగారు. కళ్యాణలక్ష్మీ యజమానులని పరామర్శించారు. ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్త వహించాలని, షాప్స్ యజమానులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా చైతన్య పరచాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.