కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం మెమో విడుదల చేసిన సీఎం కేసీఆర్.. ఆనందంగా ఉందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్!

Related image

కరోనా మహమ్మారి నిర్మూలనలో భాగంగా నేడు లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం నేడు Memo నెంబర్ 6837 /  Ex II (1) / 2020. Date 13.05.2020 ను విడుదల చేయడం ఆనందంగా వుందన్నారు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈ మెమో ప్రకారం రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్ లో ప్రాంతాలు మినహా అన్ని జిల్లాలో కల్లు గీత కార్మికులు కల్లును భౌతిక దూరాన్ని పాటిస్తూ, లాక్ డౌన్ నిబంధనల ప్రకారంగా అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వటం జరిగిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ మెమో వల్ల రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది కల్లు గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు, సుమారు 40 లక్షల మందికి పరోక్షంగా జీవనో పాధి కలుగుతుందన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ జిల్లాలలో గీత కార్మికుల తమ వృత్తిని, ఉపాధిని కోనసాగించే క్రమంలో అక్కడక్కడ కోన్నిసంఘటనలు జరిగాయన్నారు.

గీత కార్మికుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గీత కార్మికుల సంక్షేమంను దృష్టిలో పెట్టుకోని లాక్ డౌన్ ఉన్న గీత వృత్తిదారులు తమ వృత్తిని కోనసాగించుకోవాలని అనుమతులు ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా కల్లు వృత్తిదారుల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

T C S - 4394, TFTs - 3746 లైసన్సులు రాష్ట్ర వ్యాప్తంగా కలిగి 2,24,852 కల్లు గీత వృత్తిదారులు ఈ మినహాయింపు వల్ల లబ్దిపోందుతారన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గీత వృత్తదారుల పక్షపాతిగా అభివర్ణించారు. చేతి వృత్తులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.

గీత వృత్తిదారుల సంక్షేమం కోసం ఇప్పటికే ఎక్స్ గ్రేషియోను గీత వృత్తిలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల నుండి 5 లక్షల వరకు, శాశ్వత అంగవైకల్యం పోందిన వారికి 50వేల నుండి 5 లక్షలకు పెంచి గీత కార్మికుల కుటుంబాలను అదుకుంటున్నామన్నారు. తాటి చెట్ల రకం ను పూర్తిగా రద్దు చేయటం జరిగింది. గతంలో సుమారు సంవత్సరంకు 16 కోట్లుగా ఉండేది. అలాగే, కల్లు గీత కార్మికుల పాత బకాయిలను రూ. లు 8 కోట్లును రద్దు చేయటం జరిగిందన్నారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నీరాను ప్రోత్సహించుటకు జీవో ను ఇప్పటికే జారీ చేసామన్నారు. లాక్ డౌన్ ఎత్తవేసిన తరువాత పూర్తి స్థాయిలో అమలు చేస్తాము. ట్యాంక్ బండ్ పరిసరాల్లో నీరా కేంద్రంను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు. గీత వృత్తిదారులను ప్రోత్సహించుటకు నేటి వరకు 3 కోట్ల 54 లక్షల తాటి, ఈత చేట్లను నాటటం జరిగింది. హరితహారంలో భాగంగా ఇంకా కోట్లాది తాటి, ఈత మొక్కలను ప్రజాప్రతినిధులతో కలసి ఈ వర్షాకాలంలో నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు.

ఈ పత్రికా సమావేశంలో MLC గంగాధర్ గౌడ్, MLA ప్రకాష్ గౌడ్, ఆబ్కారి శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, గౌడ సంఘాల నాయకులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, బాలగొని బాలరాజు గౌడ్, చింతల మల్లేశం గౌడ్, అంబాల నారాయణ గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్, అయిలి వెంకన్న గౌడ్, ప్రతాప్ గౌడ్, రమణ గౌడ్, బింగి గణేష్ గౌడ్ లు పాల్గొన్నారు.

More Press Releases