ఏపీసీసీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్

Related image

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంపై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి నూతలపాటి రవికాంత్, ఢిల్లోలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు చేసిన ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 726/1/0/2019 కేసును నమోదు చేసింది. మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల రెండులక్షల మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు  ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  తిరిగి ప్రారంభించాలని ఆదేశించాలని ఫిర్యాదులో కోరారు.

NHRC
Mid-Day meal
Intermediate
Andhra Pradesh

More Press Releases