తోటలోని పండ్ల పంటలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పర్వతగిరి, మే 13: కరోనా లాక్ డౌన్ సమయంలో ఆ వైరస్ నుండి ప్రజలను కాపాడుతూనే, రైతులకు పంటలను కొనుగోలు భరోసా ఇస్తూనే, విస్తృతంగా మంత్రి తన విద్యుక్త ధర్మాన్ని నిర్వస్తున్నారు. మరోవైపు అదే లాక్ డౌన్ సమయాన్ని తన కుటుంబానికి, వ్యవసాయ, ఇంటి పారిశుద్ధ్య పనులకు సద్వినియోగం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో తన వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో వేసిన పంటలను చూశారు. కూలీలకు తగు సూచనలు చేశారు. అలాగే తోటలోని పండ్ల పంటలను పరిశీలించారు. ఆయా కాయలను పట్టి చూశారు.
ఈ సంర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా వైరస్ సృష్టించిన కష్టాల నుండి బయట పడడానికి లాక్ డౌన్, స్వీయ నియంత్రణే ముఖ్యమని అన్నారు. అలాగే, సామాజిక, భౌతిక దూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలతో సొంత పనులు, వ్యవసాయ పనులు చేసుకోవడంలో, చూసుకోవడంలో ఓ సంతృప్తి ఉంటుందని చెప్పారు. రైతుగా తాను ఆనందంగా గడుపుతానని అన్నారు.
మధ్యప్రదేశ్ వలస కూలీలకు మంత్రి ఎర్రబెల్లి అండదండలు:
- అన్నం పెట్టి ఆదరించి, ఆర్థిక సహాయం చేసిన మంత్రి
- కలెక్టర్ తో మాట్లాడి రవాణా సదుపాయాలపై చర్చించిన మంత్రి
- సొంతంగా ద్విచక్ర వాహనాలపై వెళతామని చెప్పిన వలస కూలీలు
- వలస కూలీలకు మాస్కులు కూడా అందచేసిన మంత్రి ఎర్రబెల్లి
- రాజమండ్రి నుంచి బయలు దేరి...వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం వద్ద ఆగిన మధ్య ప్రదేశ్ వలస కూలీలు
- వారి యోగ క్షేమాలు అడిగి...మధ్యప్రదేశ్ కు పోవడానికి పర్మీషన్లు ఉన్నాయా? అని అడిగిన మంత్రి
- మొత్తం 33 మందికి అక్కడే వసతి కల్పించిన మంత్రి ఎర్రబెల్లి
- భోజనం తర్వాత తమ ప్రయాణం కొనసాగిస్తామని చెప్పిన వలస కూలీలు
అక్కడక్కడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని, అయితే వాటిని అదిగమించడానికి ప్రభుత్వం, అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. అయినా అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి తెలిపారు. ఒక రైతుగా రైతుల సమస్యలు నాకు తెలుసు. అయినా సరే, రైతులు కొంత ఓపిక పట్టాలి అని మంత్రి అభ్యర్థించారు. ఆఖరు గింజ వరకు కూడా రైతుల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. పర్వతగిరి ఘటనపై ఆరా తీసిన మంత్రి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరితతో మాట్లాడారు.
కొనుగోలు కేంద్రాల వద్ద వస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఒకవేళ అధికారులెవరైనా అలసత్వం వహిస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నిబంధనలను అతిక్రమించే రైసు మిల్లర్లపై కూడా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అయితే, రైతులు కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, సంయమనం పాటించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోవద్దు అనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎక్కడైనా తప్పులు జరిగినా, సమస్యలున్నా అధికారులు, ప్రభుత్వం, నిత్యం అందుబాటులో ఉంటున్న తన దృష్టికి తేవాలన్నారు. రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వాన్ని బద్ నామ్ చేసే పనులకు ఎవరు పురికొల్పినా సరే, పూనుకోవద్దని రైతులకు మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:
- ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
- లాక్ డౌన్, స్వీయ నియంత్రణని, సామాజిక భౌతిక దూరాన్ని పాటిస్తూ ఐక్యంగా పోరాడాలి
- ప్రభుత్వ ఆదాయం కన్నా, ప్రజల ప్రాణాలే ముఖ్యమని సిఎం కెసిఆర్
- అత్యంత క్లిష్ట సమయంలోనూ ప్రజల క్షేమాన్ని, వారి సంక్షేమాన్ని వీడకుండా సీఎం కెసిఆర్ అద్భుతమైన పరిపానను అందిస్తున్నారు
- రైతుని రాజుని చేయడం కోసం కెసిఆర్ అహర్నిషలు కష్ట పడుతున్నారు
- ఈ కష్ట కాలంలోనే ఉన్నోళ్ళు లేనోళ్ళకు సాయం చేసి ఆదుకోవాలి
- వర్దన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేదల ఆకలి తీరుస్తూ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం
- ప్రతిపక్షాల వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి విరుచుకుపడ్డారు
- ప్రతిపక్షాలు అవనసర విమర్శలు మానుకోవాలి
- ప్రతిపక్షాలు దేశాన్ని, ప్రజలకు తమకు మాలిన నీతులు చెప్పి, పబ్బం గుడపుతున్నాయి
- రాజకీయాలు పక్కకు పెట్టి, ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకున్నవాడే నిజమైన నాయకుడు
- రైతులకు రుణ మాఫీ, రైతు బంధు పెట్టుబడులు, ఉచితంగా 24 గంటల విద్యుత్, రైతు బీమా, పంటలు మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయడం వంటి చర్యలు ఏ ప్రభుత్వమూ చేయడం లేదు
- కెసిఆర్ అన్నం పెట్టే రైతును అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు
- ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు
- ఇలాంటి మనసున్న సీఎంని నేను నా 40ఏళ్ళ రాజకీయ జీవితంలో చూడలేదు