ఏపీ ప్రాజెక్ట్ ను బూచిగా చూపి ఇరు ప్రాంత ప్రజల మధ్య అగాధం సృష్టించే కేసీఆర్ కుట్రను తిప్పి కొట్టాలి: మేడా శ్రీనివాస్
- కరోనా కోటీశ్వరుడు కేసీఆర్
- కరోనా లెక్కల సంఖ్యలో అనేక అనుమానాలు
- ఒవైసి కి భయపడే కేసీఆర్
- ఏపి ప్రాజెక్ట్ ను బూచిగా చూపి ఇరు ప్రాంత ప్రజల మధ్య అగాదం సృష్టించే కేసీఆర్ కుట్రను తిప్పి కొట్టాలి: మేడా శ్రీనివాస్ ఎద్దేవా, అర్పిసి
కరోనాతో దేశ వ్యాప్తంగా ఆర్థిక సమస్యలతోను, వైరస్ ప్రభావంతో ప్రభుత్వాలు, ప్రజలు ఆందోళన చెందుతుంటే కేసీఆర్ ఒక్కరు మాత్రమే మిగులు నిధులతో వున్నారని, కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించటంపై దృష్టి సారించటం కన్నా లాక్ డౌన్ పొడిగింపుపైనే కేసీఆర్ ఆశక్తి చూపించటం వెనుక కేసీఆర్ కు పెద్ద వ్యూహమే వుందని ఆయన ఆరోపణ చేశారు.
కోవిడ్ పాజిటివ్ కేసులు నిజాయితీగా ప్రకటించటంలోను, కోరంటెన్ బాధితుల సౌకర్యాల లోను, భాదితులను ఆదుకోవటంలోను అధికారం ముసుగులో కేసీఆర్ బారి అవినీతికి పాల్పడ్డారని , వాస్తవాలను వెలికితీసే పాత్రికేయులను, ఎలక్ట్రానిక్ మీడియా వారిని బెదిరిస్తు అధికారాన్ని శాసిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఒవైసీకి భయపడి పాతబస్తీలో కరోనా ప్రభావిత వివరాలను సేకరించటంలో కేసీఆర్ వెనకడుగు వేస్తున్నారని, రాజకీయ ప్రయోజనాలుకు ఇచ్చే ప్రాధాన్యత కరోనా భాదితులకు ఇవ్వటం లేదని,వాస్తవ లెక్కలను ప్రకటించటంతో కేసీఆర్ ఆశక్తి కనపరచటం లేదని ఆయన పేర్కొన్నారు.
కరోనా సహాయార్థం కేంద్రం 6 వేల 82 కోట్లు, ఉద్యోగులు జీతాలకు కోతపెట్టి 4 వేల కోట్లు, విరాళాలు నుండి 500 కోట్లు సేకరించిన కేసీఆర్, రోగులు ఇప్పటి వరకు కోలుకోవడానికి 39 కోట్లు, కరోనా అనుమానితులకు 9కోట్లు, కోరంటెన్ నిమిత్తం 42 కోట్లు, ఆసుపత్రులు ఏర్పాటు కు 100 కోట్లు, పేదలకు 1500/-చొప్పున ఇచ్చినవి మొత్తంగా 1200 కోట్లు, 12 కిలోల బియ్యం కు 1000 కోట్లు, ఉద్యోగుల బోనస్సు 100 కోట్లు, మొత్తం ఖర్చు 2,590 కోట్లు అనుకున్నా ఆశ్చర్య పోయే విషయం ఏమిటంటే ఉద్యోగుల జీతాలనుండి 4000 కోట్లు కోత విధించి వారికి బోనస్ 100 కోట్లు కేటాయించటం గమనిస్తే కేసీఆర్ వంటి మానవతా వాది నేటి కాలంలో అరుదుగా వుంటారని, నేటికి కేసీఆర్ 7,992 కోట్లు పైనే నిల్వలో వుండటం గమన్నార్వం, లాక్ డౌన్ పొడిగింపు ఫార్ములా కేసీఆర్ కు బాగా లాభం చేకూరుతుందని, ప్రజలు మాత్రం అనేక ఆర్ధిక కష్టాలతో నిత్య వేదనకు గురైతున్నారని ఆయన ఆవేదన చెందారు.
ఏపి ప్రాజెక్ట్ ను బూచిగా చూపి మరో నీటి వివాదానికి తెరలేపి ఇరు ప్రాంతాల ప్రజలు మధ్య అగాదం సృష్టించే కుట్ర కేసీఆర్ రచిస్తున్నారని, ఇరు ప్రాంత ప్రజలు కేసీఆర్ మాయలో పడకుండా అభివృద్ధి పైనే దృష్టి సారించాలని, కేసీఆర్ కు అలవాటుగా మారిన నీటి వివాదాలు ను ప్రజలు తిప్పి కొట్టాలని, కేసీఆర్ రాజకీయ కుట్రలకు తెలంగాణ ప్రజలు మరో మారు మోసపోవద్దు అని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరుల కుటుంబాలను ఆదుకోవటం లోను, తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు, కవులు, కళాకారులు, ఉద్యోగులు, సామాన్యుల జీవితాలను ఎగతాళి చేస్తు తెలంగాణ రాష్ట్ర అవతరణకు దార్శినికుడు కేసీఆర్ అని అబద్దపు చరిత్రను పదే పదే చెప్పుకుంటూ అమరుల ఆత్మలు ను బాధిస్తున్నారని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.
ప్రశ్నించే గొంతులను వేధిస్తు, ప్రతిపక్ష నేతలను అక్రమ కేసులతో బెదిరిస్తు, ఆంధ్రా - తెలంగాణ ఐక్యతలో నిత్యం విషం పోస్తు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ,తెలంగాణ ప్రజల నెత్తిపై లక్షల కోట్ల అప్పుతో అభివృద్ధి కి నోచుకోని అహంకార పాలనకు బ్రాండ్ అంబాసిడర్ గా తెలంగాణ ను నియంత వలే పాలిస్తున్నారని ఆయన సూటిగా చెప్పారు.
కేసీఆర్ పాలన సాగినన్నాళ్లు తెలంగాణ అభివృద్ధి చెందదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదని, రెండు తెలుగు రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలు గా అభివృద్ధి చెందాలంటే ఆంధ్రా, తెలంగాణ ఐఖ్యత ను ప్రజలు ప్రోత్సహించాలని, ఆ దిశగా ప్రయత్నాలు సాగనన్నాళ్లు కేసీఆర్, కేసీఆర్ కుటుంబమే సంపన్నులుగాను, పాలకులుగాను చక్రం తిప్పుతారని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలయిక తోనే కేసీఆర్ కుయుక్తులకు చమర గీతం పాడి పేదరికం లేని జీవితాలను గెలవ వచ్చని, తెలంగాణ లోను, ఆంధ్రప్రదేశ్ లోను అనేక జిల్లాలు అభివృద్ధి కి నోచుకోవటం లేదని ఒక మంచి కలయికతో రెండు రాష్ట్రాలను అభివృద్ధి సాధించవచ్చని ఆయన పిలుపు నిచ్చారు.
కొరోనా నిధుల ఖర్చు పైన, కరోనా వాస్తవ లెక్కల పైన, తెలంగాణ అభివృద్ధి పైన, అప్పులు పైన కేసీఆర్ చర్చకు సిద్ద పడగలరా ! అని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ బహిరంగం గా సవాల్ చేశారు.